*గురుమహిమ - 1*
☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️
*శ్రీ గణేశాయ నమః*
*సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమామ్ ।*
*అస్మదాచార్య పర్యంతమ్ వందే గురుపరంపరామ్ ॥*
భారతీయులు , ముఖ్యంగా హైందవులు గురువుకు ఇచ్చిన స్థానం మహోన్నతమయింది. *“మాతృదేవోభవ , పితృదేవోభవ , ఆచార్యదేవోభవ , అతిథి దేవోభవ , దేవదేవోభవ"* అని వరుసగా తల్లి , తండ్రి , గురువు , దైవమని అన్నారు. అసలు గురువే పరమదైవము. గురువే సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపము.
*అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయా।* *చక్షురున్మీలితం యేన తస్మై శ్రీ గురవేనమః ||*
అజ్ఞానమనే చీకటి ఆవరించిన కారణముగా శిష్యుడు అంధునివలె ప్రపంచ తత్త్వం తెలుసుకోలేక పోతున్నాడు. ఆ శిష్యుడినెలాగయినా ఉద్దరించాలనే సంకల్పం కలిగింది. గురువుకు. అంతే , దీనికారణంగా శిష్యునికి అనిపిస్తోంది. ఇంతటి మహాత్మ్యము కల్గిన మాగురుదేవులకు నమస్కారము.
*గురురేకః శివస్సాక్షాత్ గురుస్సర్వార్థసాధకం గురురేవ పరం తత్వం సర్వం గురుమయం జగత్ గురురేకో వరారోహే పాపంనాశ యతి క్షణాత్*
*గురుంవినా యతస్తంత్రే నాంధకారః కధజ్ఞాన అత ఏవ ప్రయత్నేన గురుః కర్తవ్య ముత్తమం ॥*
సాక్షాత్ శివస్వరూపుడు , ఏకార్యాన్ని సాధించాలన్నా సాధనలాంటివాడు గురువు. ప్రపంచంలోని అన్ని తత్వాలకంటే శ్రేష్టమయినది గురు తత్త్వం. ఈలోకమంతా గురుమయమే. మనం చేసిన పాపాలను క్షణకాలములో దూరము చేయగలిగిన శక్తిమంతుడు ఒక్క గురువే. ఏ శాస్త్రాన్నయినా క్షుణ్ణంగా అధ్యయనం చేయాలంటే తప్పనిసరిగ గురువు కావాలి. గురువులేని విద్య గుడ్డి విద్య ఇన్ని లక్షణాలు తనలో వుంటాయి గనుకనే ఉత్తమ గురువును అన్వేషించాలి. పరోపకార భావన , జపపూజాదులు ఆచరణ , సార్ధకమైన పలుకు , శాంతస్వభావం , వేదవేదాంగాలు క్షుణ్ణంగా తెలిసియుండుట , యోగశాస్త్ర సిద్ధాంతాలను సులువుగా భోధించటం , దేవతల మనస్సులను సంతోషపెట్టగలిగి యుండుట , మొదలగు సుగుణాలతో పరిపూర్ణమైన వాడే గురువు. ఇంతేకాదు సకల శాస్త్ర జ్ఞానము , సర్వవిధ సామర్ధ్యము మంచిమాటకారి తనము , చక్కని తేజస్సు , దానగుణము , తత్త్వం ఎరింగి యుండుట మొదలైన లక్షణాలు కలిగివున్న వ్యక్తి సద్గురువు.
*స్వయమాచరతే శిష్యా నాచరేస్థాపయత్వపి ||* *అచినోతిహశాస్త్రర్దనాచార్య సేనకధతే ॥*
ప్రపంచములో అన్నింటికంటె తేలికైన పనిఏదంటే ఇతరులకు ఉపదేశించడం. దీన్ని అందరూ చేయగలరు. అలాగాక పదిమందికి చెప్పదలచుకున్నది తాను ఆచరించి , ఆ తరువాతే పరులకు ఉపదేశించాలి. ఇలాంటి మహానుభావుడే గురువు. ఇతడే ఆచార్యుడు. గురువును మించిన దైవం , శాస్త్రము , గురువును మించిన తపస్సు , గురువును మించిన మంత్రము , గురువు కంటే మించిన ప్రయోజనము వేరే ఏమియులేదు. నిత్యం గురుమూర్తిని ధ్యానించడం , గురుతత్త్వము జపించడం అలవాటు చేసుకోవాలి. గురువు నివసించే ప్రదేశమే కాశీక్షేత్రము గురుపాదోదకమే గంగానది. గురువు విశ్వేశ్వరుడు. గురుమంత్రమే తారక మంత్రము. ధార్మిక విషయాలపట్ల ప్రేరణ నిచ్చేవాడు. పండంటి జీవితానికి చక్కని సలహాల నిచ్చేవాడు. చదివింప జేసేవాడు , బ్రహ్మసాక్షాత్కారం కలుగ జేసేవాడు. చదువు చెప్పేవాడు. అమూల్యమైన హిత వచనాలు పల్కేవాడు అని గురువులు ఆరు విధాలుగా వుంటారు.
ఈ అన్ని లక్షణాలు అద్భుతంగా ఒకే వ్యక్తిలోనే వుండవచ్చును. అలాంటి మహానుభావుణ్ణి గురువుగా పొంద గలిగినవారు ధన్యజీవులే. ఏకొందరికో గాని ఈ భాగ్యంపట్టదు. *గురువు అనే పేరుపెట్టుకొని తమశిష్యుల సంపదలన్నీటినీ కొల్లగొట్టే వారెందరో వున్నారు. ముఖ్యంగా ఈ రోజుల్లో ఇలాంటి వేషగాళ్లెందరో కనిపిస్తారు. వీరుకాదు గురువులు. శిష్యులు హృదయ తాపాన్ని దూరం చేయగలిగినవాడే నిజమైన గురువు. అంటే శిష్యుల సంపద మీద దృష్టిసారించక , వారికి ఆధ్యాత్మిక విషయాలను సులువుగ తెలియపరచి , బ్రహ్మసాయుజ్యానికి తోడ్పడే వాడే ఉత్తమ గురువని తెలియాలి.* అందుకే గురులక్షణము గూర్చి మనపెద్దలు ఇలా సెలవిచ్చియున్నారు. *"మూలమెరిగినవాడు గురువు - మూల్యము కోరని వాడు గురువు. మూలతత్వమెరింగినవాడు గురువు - అమూలాగ్రం నిన్నెరిగినవాడు గురువు."* అని అన్నారు. ఇచట కొందరు బోధగురువుల బాధగురువుల లక్షణాల గురించి వివరించి యున్నాము. ఇది ఎవరెవరికి ఏవిధంగా వర్తిస్తుందో ఎవరికివారే ఆత్మపరిశోధన చేసుకొనుటకు లభ్యమైన అవకాశంగా భావించు కోగలరు. గురువులలో రెండురకాల వారున్నారు.
*1. బోధగురువులు , 2. బాధగురువులు. వారి గుణగణములను గూర్చి తెలుసుకొందాము.*
బోధగురువులు క్షమిస్తారు - బాధగురువులు దండిస్తారు.
బోధగురువులు మితాహారులు - బాధగురువులు అమితాహారులు.
బోధగురువులు శాంతమూర్తులు - బాధగురువులు అవేశపూరితులు.
బోధగురువులు నిరాడంబరులు - బాధగురువులు డంబాచారులు.
బోధగురువులు జ్ఞానసంపన్నులు - బాధగురువులు జ్ఞానశూన్యులు
బోధగురువులు మూల్యమాశించరు బాధగురువులు ధనకాంక్షులు
బోధగురువులు ఆశీర్వదిస్తారు - బాధగురువులు శపిస్తారు.
బోధగురువులు ధర్మవర్తనులు - బాధగురువులు దురాచారులు.
బోధగురువులు మితభాషులు - బాధగురువులు వాచాలరులు.
బోధగురువులు వాంఛారహితులు - బాధగురువులు ఆశాపరులు.
బోధగురువులు యదార్థవాదులు - బాధగురువులు కుయుక్తిపరులు.
బోధగురువులు దైవభక్తులు - బాధగురువులు భక్తివర్తకులు.
బోధగురువులు కులమతాతీతులు - బాధగురువులు మతపిచ్చోళ్ళు..
బోధగురువులు సహృదయులు - బాధగురువులు కఠినాత్ములు.
బోధగురువులు అహింసావాదులు - బాధగురువులు హింసావతారులు
బోధగురువులు సాధ్వులు - బాధగురువులు క్రోధసంపన్నులు.
బోధగురువులు సంకల్పసిద్ధులు - బాధగురువులు సంకల్పరహితులు.
బోధగురువులు లక్ష్యసాధకులు - బాధగురువులు గమ్యం తెలియనివారు.
బోధగురువులు మంచివారు - బాధగురువులు దానికి భిన్నమైనవారు
బోధగురువులు అందరివారు - బాధగురువులు కొందరివారు.
బోధగురువులు రాగద్వేషరహితులు - బాధగురువులు రాగద్వేషపూరితులు.
బోధగురువులు మంచివక్తలు - బాధగురువులు మాటలకారులు.
*తన దరిచేరినవారికి సకల విద్యలు బోధించి ఉన్నతుని చేయువాడే బోధగురువు. తన దరిచేరిన వారిని లోపాలను లెక్కించి మానసిక ఒత్తిడి కలిగించువారు బాధగురువులు.*
*ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప*
🙏🏼🙏🏼🙏🏼🙏🏼