📚. ప్రసాద్ భరద్వాజ
*🌻. కాలజ్ఞానంలో చెప్పినవి – ఇప్పటివరకు జరిగినవి - 2 🌻*
5. జనసంఖ్య విపరీతంగా పెరుగుతుంది. - ప్రస్తుతం ప్రపంచ జనాభా విపరీతంగా పెరిగింది. ఒక్క భారతదేశ జనాభానే వందకోట్లు దాటడం మితిమీరిన జనాభా పెరుగుదలకు నిదర్శనం. భవిష్యత్ లో అన్ని రకాల సమస్యలూ అధిక జనాభా గురించే మొదలవుతాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
6. బ్రాహ్మణుల అగ్రహారాలు నశించిపోతాయి. - ఇప్పటివారికి తెలియదు కానీ, వంద సంవత్సరాల కిందటి వరకు కూడా బ్రాహ్మణులకు వందల ఎకరాలతో కూడిన అగ్రహారాలు వుండేవి. ప్రస్తుతం ఎక్కాడా అగ్రహారాలు లేవు.
7. హైదరాబాద్ లో తురకలు, హిందువులు పరస్పరం కిరాతకంగా చంపుకుంటారు…- . పదిహేనేళ్ళ కిందటి వరకు కూడా హైదరాబాద్ లో మత కల్లోలాలు – అది కూడా కేవలం ముస్లిం, హిందువుల మధ్య మాత్రమే ఎక్కువగా జరుగుతున్నాయి. ఇక హుండీలో చోరీలు చాలా ఎక్కువగా వున్నాయి.
8. చిత్ర విచిత్రమైన యంత్రాలు వస్తాయి కానీ, చావు పుట్టుకలు మాత్రం కనుగోనలేకపోతారు. - సృష్టిని మార్చటానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. అన్ని రంగాల్లాగే వైద్య రంగం కూడా బాగా అభివృద్ధి చెందింది. కాలు విరిగేతే రాడ్ వేస్తున్నారు. అసలు కాలే లేకుంటే కృత్రిమ కాలు పెడుతున్నారు. గుండె మార్పిడి దగ్గర్నించీ ఎన్నో అపురూపమైన శస్త్ర చికిత్సలు జరుగుతున్నాయి. ఇంత అభివృద్ధి సాధించిన మాట నిజమే కానీ, చనిపోయిన వారిని బతికించే యంత్రం, మనుషుల్ని పుట్టించే యంత్రాన్ని ఇప్పటివరకూ కనుక్కోలేదు. బహుశా, భవిష్యత్ లో కనుగొనగలరనే నమ్మకం కూడా లేదు.
9. రావణ కాష్టమున కల్లోలము చెలరేగి దేశాన్ని అల్లకల్లోల పెట్టాను. - రావణుని దేశం అంటే శ్రీలంక. శ్రీలంకలో తమిళులు, శ్రీలంక వాసుల మధ్య జాతి కలహాలు మొదలయ్యాయి. చివరకి ఆ వైరమే భారత ప్రధాని రాజీవ్ గాంధీని బలిగొన్న విషయం తెలిసిందే. ఎల్.టీ.టీ.ఈ. ప్రభాకరన్ హతుడైన సందర్భంలో ఇరుపక్షాలవారూ మృత్యువాతపడ్డారు.
సశేషం....