లలితా పంచమి - ఉపాంగ పంచమి వ్రతం ఎలా చెయ్యాలి?*

P Madhav Kumar

 *ఉపాంగ లలితా పంచమి*


🌈  *'త్రిపురాత్రయం'* లో రెండవ శక్తి స్వరూపిణి ఈ లలితా మాత. అందుకే శరన్నవరాత్రులలో వచ్చే పంచమిని *'లలిత పంచమి'* అని కూడా అంటారు.


🌈 *చెరకుగడ, విల్లు, పాశము, అంకుశము ధరించి, లక్ష్మీదేవి, సరస్వతీదేవి కుడి ఎడమలు సేవలు అందిస్తుండగా శ్రీ లలితా పరాభట్టారిక భక్తుల ఇక్కట్లు తొలగించి, అప్లైశ్వర్యాలను ప్రసాదిస్తుంది.*


🌈 కన్యలు మంచి భర్త కొరకు, ముత్తైదువులు దీర్ఘ సుమంగళి గా అఖండ సౌభాగ్యం కొరకు ఈ నవరాత్రులలో అయిదవ రోజు 'ఉపాంగ లలితా వ్రతం' ఆచరిస్తారు. 


🌈 అమ్మవారిని శ్రీ లలితా దేవి అలంకారం లో సహస్రనామ, అష్టోత్తర నామాలతో కుంకుమ పూజలు చేసి, ముత్తైదువలకు తాంబూలాలు ఇచ్చుకుంటారు.


🌈 ముత్తైదువులను పిలిచి, సువాసినీ పూజలు చేస్తారు.


🌈 కైలాస గౌరీ నోము కాని గ్రామ కుంకుమ నోముకాని నోచుకున్న వారు చాలా మంది ఈ రోజు ఉద్యాపన చేసుకుంటారు. కొంతమంది తమ గృహాల్లోనే సామూహిక లక్ష కుంకుమార్చనలు ఏర్పాటు చేసుకుంటారు.


🌈 బొమ్మల కొలువులు పెట్టుకున్న వారు పేరంటాలు చేసుకుంటారు. శ్రీ లలితా దేవి తనని కొలిచిన భక్తులకు దారిద్ర్య దుఃఖాలు నశింపచేస్తుంది.


🌈 కుంకుమ పూజలు చేసేవారికి మాంగళ్య సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుంది.


🌈 పంచమి నాడు శ్రీ లలితాదేవి దేదీప్యమైన మూర్తిని మనస్సులో ప్రతిష్టించుకుని, *'ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రేనమః'* అని వీలైనన్ని సార్లు జపించుకుంటే అమ్మ మాతృమూర్తియై చల్లగా చూస్తుంది.


🌈 *ఈనాడు ధరించవలసిన వర్ణం:* 

తెలుపు.


🌈 *నివేదనలు:* 

పులిహోర, పెసర బూరెలు

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat