మహిషుడనే రాక్షసుడు ముల్లోకాలపై ఆధిపత్యం సంపాదించాడు. వాణ్ణి సంహరించడానికే జగదంబ మహిషాసురమర్దినిగా అవతరించింది. విశ్వమోహినిగా, పద్దెనిమిది చేతులతో ఆవిర్భవించింది. అనేక దివ్యాభరణాలు, ఆయుధాలతో మహా తేజస్సుతో రూపొందిన దుర్గాదేవి పద్దెనిమిది చేతులూ క్షణంలో వెయ్యి చేతులయ్యాయి. ఆమె సింహాన్ని వాహనంగా చేసుకుంది. ఎనిమిది రోజులపాటు ఎందరెందరో భయంకర రాక్షసుల్ని దేవి సంహరించింది. తామ్రుడు, భక్షురుడు, బిడాల, అసిలోమ లాంటి మహా బలవంతులైన రాక్షసుల్ని సంహరించడంలోనే ఎనిమిదిరోజులు గడిచిపోయాయి. దుర్ధరుడు, త్రినేత్రుడు, అంధకాసురుడు అనే రాక్షసుల్ని కూడా సంహరించిన తర్వాత తొమ్మిదోరోజు మహిషాసురుడు నేరుగా రణరంగంలోకి వచ్చాడు. అమ్మవారు నూరంచుల చక్రాయుధంతో మహిషాసురుడి తల నరికివేసింది. లోకానికి మహిషాసురుడి పీడ వదిలింది. ఆ రోజు ఆశ్వయుజ మాసం శుద్ధ నవమి. దానికే మహర్నవమి అని పేరు. ఆయుధపూజ అంతరార్ధం మహర్నవమి నాడు ప్రధానంగా ఆయుధ పూజ చేస్తారు. మహిషాసురుణ్ణి వధించడానికి దుర్గాదేవి అష్టభుజాలతో ఉద్భవించింది. పూర్వకాలంలో చక్రవర్తులు, రాజులు తమ ఆయుధాల్ని, వాహనాల్ని, రథాల్ని, శకటాల్ని మహర్నవమి నాడు ప్రత్యేకంగా అలంకరించేవారు. కాలస్వరూపిణి శ్రీమాత అనుగ్రహంతో మన మనోబుద్ధులు సునిశితంగా ఉండాలని, నిరంతర సానుకూల దృక్పథంతో ముందడుగు వేయాలనీ, అందుకు మన అంతర్గత ఆయుధాలన్నీ సర్వదా ఉపకరించాలని కోరుకుందాం.మహర్నవమి :
మహిషుడనే రాక్షసుడు ముల్లోకాలపై ఆధిపత్యం సంపాదించాడు. వాణ్ణి సంహరించడానికే జగదంబ మహిషాసురమర్దినిగా అవతరించింది. విశ్వమోహినిగా, పద్దెనిమిది చేతులతో ఆవిర్భవించింది. అనేక దివ్యాభరణాలు, ఆయుధాలతో మహా తేజస్సుతో రూపొందిన దుర్గాదేవి పద్దెనిమిది చేతులూ క్షణంలో వెయ్యి చేతులయ్యాయి. ఆమె సింహాన్ని వాహనంగా చేసుకుంది. ఎనిమిది రోజులపాటు ఎందరెందరో భయంకర రాక్షసుల్ని దేవి సంహరించింది. తామ్రుడు, భక్షురుడు, బిడాల, అసిలోమ లాంటి మహా బలవంతులైన రాక్షసుల్ని సంహరించడంలోనే ఎనిమిదిరోజులు గడిచిపోయాయి. దుర్ధరుడు, త్రినేత్రుడు, అంధకాసురుడు అనే రాక్షసుల్ని కూడా సంహరించిన తర్వాత తొమ్మిదోరోజు మహిషాసురుడు నేరుగా రణరంగంలోకి వచ్చాడు. అమ్మవారు నూరంచుల చక్రాయుధంతో మహిషాసురుడి తల నరికివేసింది. లోకానికి మహిషాసురుడి పీడ వదిలింది. ఆ రోజు ఆశ్వయుజ మాసం శుద్ధ నవమి. దానికే మహర్నవమి అని పేరు. ఆయుధపూజ అంతరార్ధం మహర్నవమి నాడు ప్రధానంగా ఆయుధ పూజ చేస్తారు. మహిషాసురుణ్ణి వధించడానికి దుర్గాదేవి అష్టభుజాలతో ఉద్భవించింది. పూర్వకాలంలో చక్రవర్తులు, రాజులు తమ ఆయుధాల్ని, వాహనాల్ని, రథాల్ని, శకటాల్ని మహర్నవమి నాడు ప్రత్యేకంగా అలంకరించేవారు. కాలస్వరూపిణి శ్రీమాత అనుగ్రహంతో మన మనోబుద్ధులు సునిశితంగా ఉండాలని, నిరంతర సానుకూల దృక్పథంతో ముందడుగు వేయాలనీ, అందుకు మన అంతర్గత ఆయుధాలన్నీ సర్వదా ఉపకరించాలని కోరుకుందాం.