అన్నవరము కొండ పైన అందముగ నెలకొన్న ఓ ఆదిదేవా
బాధ లెన్నున్నా నా ఆత్మ మందిరం నీ వెనన్నా
ఆ… ఆ… ఆ… హరి
1. మోయగలవు ఈ భూభారం చూపగలవు పుణ్యమార్గం
నేర్పగలవు మూఢుల జ్ఞానం మార్చగలవు క్రూరుల సైతం
ఇన్ని మహిములున్న నీవు ఏలనన్ను బ్రోవరావు
ఇది నా తల వ్రాతను కోనా మరి నీ పగ యను కోనా
తీర్పవయ్యా ఆ వేదన ఆ… ఆ… ఆ… హరి
అన్నవరము కొండ పైన అందముగ నెలకొన్న ఓ ఆదిదేవా
బాధ లెన్నున్నా నా ఆత్మ మందిరం నీ వెనన్నా
ఆ… ఆ… ఆ… హరి
2. కన్న తండ్రి నీవనీ కనిపించే దైవమనీ
మనసారా నమ్మితిని మనసే అర్పించాలని ‘
దీనునిగా వేడితిని దయతో మము బ్రోవమని
ఏలనయ్య నీఅలుక చూపవయ్య, నీకరుణా చూపవయ్య
నీకరుణా ఆ… ఆ… ఆ… హరి
అన్నవరము కొండ పైన అందముగ నెలకొన్న ఓ ఆదిదేవా
బాధ లెన్నున్నా నా ఆత్మ మందిరం నీ వెనన్నా
ఆ… ఆ… ఆ… హరి
3. కలియుగాన నీరూపం కనుగొనంగ ఎవరి తరం
ఈనాటికి సత్యవరం నిలుచున్నది నీ కోసం
అందమైన ఆలయాన అలిగి నీవు కూర్చుంటే
ఏలనయ్య నీఅలుక చూపవయ్య, నీకరుణా చూపవయ్య
నీకరుణా ఆ… ఆ… ఆ… హరి
అన్నవరము కొండ పైన అందముగ నెలకొన్న ఓ ఆదిదేవా
బాధ లెన్నున్నా నా ఆత్మ మందిరం నీ వెనన్నా
ఆ… ఆ… ఆ… హరి