మంత్ర సిద్ధాదిశోధనం, సిద్ధాది చక్రం, కులాకుల చక్రం, ఋణ, ధనశోధనం ఎందుకు?

P Madhav Kumar


*ప్ర:  మంత్రజపం వలన నాడీ వ్యవస్థలో మార్పు కలుగుతుందంటారు కదా! మరి మంత్రం జపించే ముందు మంత్ర సిద్ధాదిశోధనం, సిద్ధాది చక్రం, కులాకుల చక్రం, ఋణ, ధనశోధనం ఎందుకు? సాధన వలన (కొన్నింటికి మాత్రమే)వంశానికి, సాధకునికి ఎందువలన అపకారం జరుగుతుంది? తెలుపగలరు.* 


 *జ :* ఒక్కొక్క మంత్రం ఒక్కొక్క దేవతా శక్తికి కేంద్రం. దానిని జీవచైతన్యంతో అనుసంధానించే ముందు, ఆ చైతన్యాన్ని ఆవరించి ఉన్న జన్మాంతరగతమైన దుష్ట సంస్కారాలు తొలగించాలి.

గంగను ఒక పాత్రలో ఉంచాలంటే ముందు ఆ పాత్రను శుద్ధి చేయాలి కదా! గంగ శుద్ధికారిణి అయినా. అంతే కాదు విద్యుచ్ఛక్తి ఒకటి అయినా 'వోల్టేజీ' భేదాలుంటాయి. ఎంత వోల్టేజిని ఏ పరిమాణంలో ఉన్న తీగలు తట్టుకోగలవో చూసి దాని ప్రకారం విద్యుచ్ఛక్తి సరఫరా చేస్తారు. అలాగే కొన్ని సాధనలను సరియైన ప్రకారం సాగించకపోతే అధిక ‘వోల్టేజి', చిన్న పరిమాణపు తీగలో ప్రసరిస్తే జరిగినట్లుగానే - కొన్ని 

ప్రమాదాలుంటాయి. అందుకే మంత్రము యొక్క స్వరూప స్వభావాలపై అవగాహన ఉన్న మంత్ర సిద్ధుడైన  గురువు, సాధకుని దేశకాల పరిస్థితులను జీవసంస్కారాన్నీ గమనించి, తగిన శోధన చేసి అనుగుణమైన మంత్రాన్ని ఇస్తాడు.

ఒక జీవుడు ఏ ఉపాధిలో, ఎటువంటి జీవన విధానంలో, ఎలాంటి అలవాట్లతో ఉంటున్నాడో గమనించి కొన్ని మంత్రాలు సాధన చేయాలి. అన్ని మంత్రాలకీసాధారణ నియమాలుంటాయి. కానీ వాటితో పాటు కొన్నిటికి విశేష నియమాలుంటాయి. వాటిననుసరించి మంత్రజపం ఉంటుంది.


🌸🫐🌸🫐🌸🫐🌸🫐🌸

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat