జాపాలి తీర్ధం - తిరుమల

P Madhav Kumar


Part -41

⚜️⚜️⚜️🌷🌷⚜️⚜️⚜️


తిరుమల గిరుల్లో ప్రతి అణువు ఆధ్యాత్మికం,ఆహ్లాదకరం గానే ఉంటుంది...


తిరుమల అడవుల్లో భూలోక స్వర్గం లాంటి ప్రాంతం జాపాలి తీర్ధం...


 తిరుమల కు 6 కి.మీ.దూరం లో అటవీ ప్రాంతంలో ఉండే జాపాలి తీర్ధం లో వెలసిన ఆంజనేయ స్వామి వారి గురించి తెలుసుకుందాం.


 మనం అందరం తిరుపతి వెంకటేశ్వరస్వామి దర్శనానికి భక్తులు ప్రతి సంవత్సరం వెళుతునేఉంటారు.


కాని తిరుమల అతి దగ్గర లో ఉండే అతి చారిత్రక,ఆధ్యాత్మిక ప్రాంతం జాపాలి తీర్ధం చూసిన వారు తక్కువ మంది అనే చెప్పాలి.


 జాపాలి తీర్థం 

 శ్రీ వేంకటేశుడు వెలసిన సప్తగిరులను వివరించే ఇతిహాసమాల. అందులో జాపాలి తీర్థం గురించి వివరించబడి ఉంది..


 జాపాలి అనే మహర్షి శ్రీ అంజనేయుని అనుగ్రహం తో శ్రీ రాముని దర్శనం కోరిన తపస్సు చేసిన ప్రదేశమిది.తిరుమల శ్రీవారి అలయానికి అతి దగ్గరలో ఉంది.


 సాక్షాత్తు రామబాణంతో పెల్లుబుకిన గంగగా తెలియజేయబడింది.జాపాలి మహర్షి కి దర్శనమిచ్చిన శ్రీ అంజనేయ స్వామి వారు స్వయంగా ఈ ప్రాంతంలో కొలువై ఉన్నాడు.


 జాపాలి తీర్థంలో స్నానం చేసిన భక్తులు పాపాలు నుంచి విముక్తులవుతారు.


 జాపాలి తీర్థంలో పెద్ద పెద్ద చెట్లకు వందల సంవత్సరాల వయసుంటుంది. పచ్చని కొండలు వాటి నుండి దూకుతున్ననీటి ధారలు .

 అందుకే ఈ పరిసరాల అందాలు పవిత్రతతో పులకించిన ఆగస్త్య మహర్షి ఇక్కడ అనేక సంవత్సరాలు శిష్యగణ సమెతంగా తపస్సు చేసినట్లు ఇతిహాసం ఇతిహాసాలు చెపుతున్నవి.


జాపాలి తీర్థం దట్టమైన అటవీ ప్రాంతంలో, ఏపుగా పెరిగిన వృక్ష సంపదతో, చుట్టూ చక్కటి జలపాతాలతో,దివ్య తీర్థలిలతో,పక్షుల కిలకిలారావాలతో,బెట్లుడుతల ఉయ్యాలాటలతో,దివ్య సుగంధాలతో,ఔషధీ మూలికల సంపదతో,కారణ జన్ముల కర,పాద స్పర్శతో తిరుమలకు వాయవ్యంగా సుమారు 5కి.మీ దూరంలో పాపవినాశం పోయే దారిలోఉన్నఒక సుందర చరిత్రాత్మక హనుమాన్ దివ్య తీర్థరాజం,ప్రసిద్ధ హనుమత్ క్షేత్రం.


 ఈ తీర్థ మహిమ వరాహ,స్కాంధ పురాణాలలో వర్ణితం.33కోట్ల దేవతల ప్రార్థనపై శ్రీ మహా విష్ణువు,రామావతారం దాల్చినప్పుడు, రుద్రుడు శ్రీరామదూతగా అన్ని శక్తులతో,దేవతలందరితో కలిసి వానర రూపంలో అవతరించుటకు నిశ్చయించుకొనెను.


అప్పుడు జాపాలి అనే మహర్షి హనుమంతుని అవతారానికి ముందే ఆ రూపాన్ని ప్రసన్నం గావించుకొనుటకు ఎన్నో ప్రదేశాలలో తపస్సు చేసుకుంటూ కడకు శ్రీ వేంకటాచలంలో అనగా తిరుమలలో జప,హోమాలు చేయసాగెను.అతని భక్తికి మెచ్చి భగవంతుడు తనయొక్క రాబోవు హనుమంతుని రూపాన్ని(ప్రస్తుతమున్న సింధూరకవచంలేని రూపాన్ని) స్వయంభువుగా అవతరించి చూపించెను.జపంవల్ల అవతరించినందున ఈ స్థలం ‘జాపాలి’ అయింది.అప్పుడు అన్ని తీర్థరాజములు వచ్చి చేరినందున జాపాలి తీర్థం అని పేర్కొనబడుచున్నది.


ఇక్కడికి అతి సమీపంలో ఆకాశగంగలో అంజనాదేవి తపమాచరించి ఆంజనేయ అవతారానకు సంకల్పించినది.హనుమంతుని కొరకు ఆదిశేషుడు కూడా పర్వతంగా మారి బ్రహ్మచర్యాన్ని పాటిస్తున్నట్లున్నది.అలా మారిన శేషగిరిపై శ్రీ వేంకటేశ్వరస్వామి తన అభయ హస్తములతో చరణదాసుడైన హనుమంతుని చూపుతున్నట్లుగా అర్చావతారంగా నిలిచాడు.


 అయోధ్యకాండలో జాపాలి ఋషి తనయొక్క ధర్మవిరుద్ధమైన మాటలకు వాక్కుదోషాన్ని మూటగట్టుకొని, జపాలి తీర్థములో తపస్సుచేసి రామగుండములో స్నానమాచరించి వాక్కుదోష విముక్తుడయ్యెను.శ్రీరామచంద్రుడు రావణుని సంహరించి అయోధ్య వెడుతూ సీతాసమేతంగా ఈ తీర్థములోనే స్నానమాచరించెను.


అందుకు ప్రతీకగా శ్రీరాముడు స్నానమాచరించిన తీర్థం రామగుండంగా ,సీతామాత స్నానం చేసిన తీర్థం సీతాగుండమనే పేర్లతో అలరారుతున్నాయి.


 భక్త ధ్రువుడు మొట్టమొదట ఇచ్చోటనే తపమాచరించి భగవత్ సాక్షాత్కారాన్ని పొంది ధ్రువతారయై వెలుగొందుతున్నాడు. ఇందుకు ప్రతీకగా నేటికీ ధ్రువతార అనేక ఔషధ గుణములతో నిరంతరాయంగా ప్రవహించుచూ ధ్రువతీర్థమనే పేరుతో ప్రసిద్ధి పొందింది. 


ఈ నీటిని ఆంజనేయస్వామి నిత్య కైంకర్యాలకు వాడటం జరుగుచున్నది.

 పంచమహాపాతకములు,భూతప్రేత పిశాచాది బాధలు,బ్రాహ్మణత్వం కోల్పోయినవారు,బ్రహ్మరాక్షసి పట్టినవారు ఈ తీర్థములో స్నానమాచరించడం వల్ల కష్టాలు తీరుతాయని స్కాంధ పురాణంలోని వేంకటాచల మహాత్మ్యములో చెప్పబడినది.ఎటువంటి కష్టమైనా స్నానం చేసి తడిబట్టలతో గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తే తప్పక కష్టాలు తీరుతాయి. ఇది ప్రస్తుతం ఇక్కడ జరుగుతున్న సత్యం.జన్మ శనిగలవారు వారి పుట్టిన రోజున స్వామివారికి పూజ మరియు అభిషేకం చేస్తే శనిగ్రహం వల్ల కలిగే అనేకానేక విపత్తులు కలుగవు.


 శ్రీశ్రీశ్రీ హథీరాంజీ బావాజీవారు ఇక్కడే తిరుగుతూ తపస్సు చేసుకుంటూ బాలాజీ కృపకు పాత్రులయ్యారు. ప్రస్తుతం ఈ స్థలం మహంతు శ్రీశ్రీశ్రీ1008 అర్జునదాసుగారి పర్యవేక్షణలో ఉన్నది.

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat