పూజా మందిరంలో శివ కుటుంబ చిత్రపటం

P Madhav Kumar


చాలామంది ఉదయాన్నే పూజా మందిరాన్ని శుభ్రం చేసి, తమ ఇష్టదైవాన్ని పూజిస్తుంటారు. తన దైవానికి ఇష్టమైన నైవేద్యాన్ని సమర్పించి, తమని చల్లగా చూడమని కోరుతుంటారు. అలాంటి పూజా మందిరాలలో శివకుటుంబ చిత్రపటం ఉండటం చాలా మంచిదని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి.


పార్వతీ పరమేశ్వరులు లోకానికే తల్లిదండ్రులు. అన్యోన్య దాంపత్యానికి ఆదర్శమూర్తులు. పరమేశ్వరుడు ఆయుష్షును ప్రసాదిస్తే, అమ్మవారు విజయాన్ని చేకూరుస్తుంది. తమ బిడ్డలను అనుగ్రహించడంలోను, ఆదరించడంలోను ఆ తల్లిదండ్రులు ఎంతమాత్రం ఆలస్యం చేయరు. ఇక వినాయకుడు తనని పార్ధించిన వారికి ఎలాంటి విఘ్నాలు ఎదురుకాకుండా చూస్తాడు, విద్యాభివృద్ధిని కలిగిస్తాడు.


కుమారస్వామి తేజస్సును, చైతన్యాన్ని కలిగిస్తాడు. జ్ఞానాన్ని పెంచడమే కాకుండా సంతానాన్ని అనుగ్రహిస్తాడు. ఇలా పార్వతీ పరమేశ్వరులు, వినాయకుడు, కుమారస్వామి, ఆయురారోగ్యాలను .. విజయాలను .. జ్ఞానాన్ని .. చైతన్యాన్ని కలిగిస్తారు. అందువలన వాళ్లంతా కలిసి వున్న శివ కుటుంబ చిత్రపటం, పూజా మందిరంలో ఉండటం చాలా మంచిదని అంటారు...🙏🙏🙏

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat