ఓం హర హర శివ శంభో
శివ శివ శివ హర శంభో
భక్తవ శంకర దేవా
భవముల ననచగ రావ
హర హర శివ శంభో
మా హారతి గైకొనుమా
గంగాధర శివశంకర దేవా
శుభముల నీయవయ
నిత్య శుభముల నీయవయ
జయశంకర మహాదేవ
జగముల నేలగ రావ
హర హర శివ శంభో
మా హారతి గైకోనుమా !!ఓం హర !!
జయ శివ తాండవరూప
జయముల నొసగవయా
స్వామి జయములనొసగవయా
భక్త జనావన దేవా
హే పరమేశ్వర రావ
శంకర మహాదేవ
మా హారతి గైకొనుమా!!ఓం హర!!
కరుణను చూపగా రావ
కాశీ విశ్వేశ్వర
శ్రీ కాశీ విశ్వేశ్వర
భోళా శంకర దేవా
నిరతము కొలిచెదమయ్యా
మంగళ మిదే స్వామి
జయ మంగళమిదె స్వామి!!ఓం !!
త్రిశూల ధారివి నీవు
త్రిభువన శ్రీ చరణా
హే త్రిభువన శ్రీ చరణా
ఢమరుక నాట్య స్వరూప
జయ మంగళ శివ దీప
మంగళ మీదే స్వామి
జయ మంగళ మీదే స్వామి !!ఓం!!