Part -36
⚜️⚜️⚜️🌷🌷⚜️⚜️⚜️
తిరుమల నంబి పాపనాశనం నుంచి రోజూ తెచ్చిన జలముతో శ్రీ వేంకటేశ్వర స్వామి వారి అర్చామూర్తికి అభిషేకం నిర్వహించేవారు. వయోవృధ్ధుడైన తిరుమల నంబి చాలా దూరము నుంచి అలా కుండలో పాపనాశనం జలము తెస్తుంటే శ్రీవేంకటేశ్వర స్వామి కలతచెంది ఒకరోజు ఒక బాలుడు రూపంలో తాతా అని పిలిచి దాహంగా ఉంది కుండలో ఉన్న జలం యివ్వమని కోరుతాడు, తిరుమల నంబి దానిని మూర్తి యొక్క అభిషేకమునకు తెస్తున్నానని ఇవ్వనని అంటాడు. కాని బాలుడు రాయితో కుండకు చిల్లు పెట్టి నీరు త్రాగుతాడు. దానికి నంబి ఎంతపని చేసావు. స్వామివారి అభిషేకానికి తీసుకొనివెళ్తున్న జలం అంతా త్రాగేసావు" అని బాలునితో అంటాడు. దానికి ఆ బాలుడు" తాతా యిక్కడే గంగ ఉండగా ఎందుకు అంత దూరం వెళతావు అని అప్పటి వరకూ లేని ఆకాశ గంగను చూపిస్తాడు. ఈరోజు నుంచి ఈ ఆకాశగంగ జలంతో అభిషేకం చెయ్యి" అని అదృశ్యం అవుతాడు. " ఈ రోజు నేను కడుపు నిండా నీరు త్రాగాను. నా కడుపు చల్లగా ఉంది. ఈ రోజు నాకు అభిషేకం వద్దు" అని శ్రీవేంకటేశ్వర స్వామి అర్చకులను ఆవహించి చెప్తాడు
" అభిషేకం కోసం నీరు తేసుకొని వస్తుంటే బాలుడు అన్ని త్రాగేసాడు. ఈ రోజు అభిషేకం ఈ రోజు అభిషేకం చెయ్యటానికి నీరు లేదు.అభిషేకం చెయ్యటాం ఎలా ?" అని బెంగపడుతున్న తిరుమల నంబి శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయం లోకి వస్తాడు.
అక్కడ అర్చకులు చెప్పింది విని " శ్రీస్వామియే బాలుని రూపంలో వచ్చి కుండలో నీరు త్రాగి, అభిషేకాన్ని ఆకాశగంగా జలం తో చెయ్యమని చెప్పాడు" అని తిరుమల నంబి చాలా సంతోషిస్తాడు.
అప్పటి నుంచి ఆకాశగంగ జలం తో స్వామివారికి అభిషేకం నిర్వహిస్తున్నారు.
ఈ కథనం తరువాత నుంచి తిరుమల నంబి " తాతాచార్యుడు" గా కూడా పిలవబడ్డారు.
రామానుజాచార్యులు సుమారు 1000 ఏళ్ల కిందట శ్రీవారి ఆలయంలో
తన్నీరముదు ఉత్సవాన్ని స్వామివారికి తిరుమల నంబి అందించిన విశేషసేవల జ్ఞాపకార్థం ప్రారంభించారు. అప్పటి నుంచి తిరుమలనంబి (తాతాచార్య) వంశస్థులు ఏటా తిరుమలలో ఈ ఉత్సవాన్ని నిరంతరాయంగా కొనసాగిస్తున్నారు
తిరుమలనంబి ఆలయం నుంచి ప్రదక్షిణంగా ఆయన వంశీకులు శిరస్సుపై బిందెల్లో ఆకాశగంగ తీర్థాన్ని వాహనమండపానికి తీసుకొస్తారు. అక్కడి నుంచి వేదమంత్రోచ్ఛారణ నడుమ జీయర్ స్వాములు, ఆచార్యులు, ప్రబంధ పండితులు పవిత్ర తీర్థ జలంతో ఆలయంలోనికి వేంచేపు చేస్తారు. అనంతరం తిరుమలనంబి వంశీకులు స్వామివారి మూలవిరాట్టు పాదాలపై అమరి ఉన్న బంగారు తొడుగునకు పవిత్ర ఆకాశగంగ జలంతో అభిషేకం చేస్తారు. ఈ సందర్భంగా తిరుమలనంబి రచించిన ‘తిరుమొళి పాశురాలను’ పారాయణం చేస్తారు.
తిరుమలనంబి ఆలయం దక్షిణ మాడ వీధి లో ఉంది క్యూ కాంప్లెక్స్ లోని భక్తులు స్వామి దర్శనానికి వచ్చేటప్పుడు ఒక చక్కవంతెన ఫై నుండి వస్తారు.
ఆ చక్క వంతెన క్రిందనే ఈ తిరుమలనంబి ఆలయం ఉంది ఒక్క సారి దర్శించండి...
తిరుమల తొలిపౌరుడు- తిరుమల నంబి
ఓం నమో వెంకటేశాయ 🙏🙏