విజయవాటికా పురాదీశ్వరి, ఇంద్రకీల నివాశిని, శ్రీ చక్ర అధిష్టాన దేవతయగు శ్రీ దుర్గాభవానీ..... నేను, మేము జ్ఞానముతోను, అజ్ఞానముతోనూ, తెలిసి, తెలియక చేయు సకల తప్పు ఒప్పులను మన్నించి, క్షమించి కాపాడవలెను. సత్యమగు పవిత్ర కృష్ణానది వామ భాగమున ఇంద్రకీలాద్రిపై స్వయంయుక్తముగా విలసిల్లుచూ నవ పీఠమున కూర్చునియున్న ఓం హ్రీంకారార్థ మాతృస్వరూపిణియై, అఖిలాండకోటి బ్రహ్మాండనాయకియై, సకల చరాచర జీవకోటిని పరిపాలించు సకల దేవతా స్వరూపిణియై, సకలశక్తి సమాన్వితయై, ఆనంద రసమూర్తియైన శ్రీ దుర్గాభవానీ, నీ పాదారవిందములే మాకు శరణం, శరణం,శరణం, శరణమమ్మా దుర్గాభవాని.