Read in: తెలుగు | ಕನ್ನಡ | தமிழ் | देवनागरी | English | മലയാളം | ગુજરાતી | मराठी |

Harathi Merela Lyrics || హారతీ మీరెల లిరిక్స్


హారతీ మీరెల ఇవ్వరే
అంబకు హారతీ మీరెల ఇవ్వరే

1. హారతీ మీరెల ఇవ్వరే – జ్ఞాన విద్యలకెల్ల ప్రబలము
లీలతో పదిఆరువన్నెల మేలిమి బంగారు తల్లికి

హారతీ మీరెల ఇవ్వరే
అంబకు హారతీ మీరెల ఇవ్వరే

2. పాదములకు పూజలు చేయరే
మా తల్లికి ఎప్పుడు పారిజాతపు హారమివ్వరే

హారతీ మీరెల ఇవ్వరే
అంబకు హారతీ మీరెల ఇవ్వరే

3. ఆణిముత్యపు హారములు మొలనూలు గజ్జెలు జోడు
అందెలు ప్రబల పాపట బొట్టు ముంగెర
సమముగా ధరియించిన తల్లిని

హారతీ మీరెల ఇవ్వరే
అంబకు హారతీ మీరెల ఇవ్వరే

4. లక్షవత్తుల జ్యోతి గూర్చరే మాతల్లికిపుడు
పచ్చని పళ్లెమున వాల్చరే అక్షితంబుగాను
మరి వేదాక్షరంబుల హారతులతో
రాక్షస సంహారికిపుడు ముచ్చటలరగ పాడుచూ

హారతీ మీరెల ఇవ్వరే
అంబకు హారతీ మీరెల ఇవ్వరే

📢 Follow