Jaya Jaya Sri Raja Lyrics || జయ జయ లిరిక్స్ – అమ్మ వారి భజన పాట
Read in: తెలుగు | ಕನ್ನಡ | தமிழ் | देवनागरी | English | മലയാളം | ગુજરાતી | मराठी |

Jaya Jaya Sri Raja Lyrics || జయ జయ లిరిక్స్ – అమ్మ వారి భజన పాట


జయ జయ శ్రీ రాజ రాజేశ్వరి
మమ్ము కరుణించుమా – మము కాపాడుమా
నిన్ను సేవింతుమమ్మా – శివపార్వతి

జయ జయ శ్రీ రాజ రాజేశ్వరి
మమ్ము కరుణించుమా – మము కాపాడుమా
నిన్ను సేవింతుమమ్మా – శివపార్వతి

1. జగములు కల్పించి కాపాడు తల్లి
ఇహ మహిలోన శుభ కల్పవల్లి
జననీ భవానీ నటరాజ రాణి
జననీ భవానీ నటరాజ రాణి
సతతము నిన్ను సేవింతు మమ్మా

జయ జయ శ్రీ రాజ రాజేశ్వరి
మమ్ము కరుణించుమా – మము కాపాడుమా
నిన్ను సేవింతుమమ్మా – శివపార్వతి

2. సౌజన్య శీలా – నీ విశ్వలీలా
బ్రహ్మాదులైనా – కనలేరుగా
మేమెంత వారము – నీ మహిమ తెలియ
మేమెంత వారము – నీ మహిమ తెలియ
గిరిరాజ తనయా – కరుణించుమా

జయ జయ శ్రీ రాజ రాజేశ్వరి
మమ్ము కరుణించుమా – మము కాపాడుమా
నిన్ను సేవింతుమమ్మా – శివపార్వతి

📢 Follow