శ్రీ కనకమ్మా సిరులియమ్మా వరాల
తల్లి నీవే మావరాల తల్లివి నీవే
1. కనులకు కాటుక కస్తూరి దిద్ది
కాళ్లకు పారాణి రాయగా
సరిగంగా స్నాన మాడగా
మురిపంగా ముద్దులొలుకుగా
శ్రీ కనకమ్మా సిరులియమ్మా వరాల
తల్లి నీవే మావరాల తల్లివి నీవే
2. ఇంద్ర కిలాద్రి పర్వత మందున
ఇంపుగా కూర్చుని యుంటివా
పరాకు చెందుట పాడికాదులే
బిరాని మముగని ధరను బ్రోవగా
శ్రీ కనకమ్మా సిరులియమ్మా వరాల
తల్లి నీవే మావరాల తల్లివి నీవే
3. బంగరు ఊయల పట్టెమంచము
పరుపులు పానుపు లేయగా
జో జో యని జోల పాడగా
అంగదు లందరు హారతు లీయగా
శ్రీ కనకమ్మా సిరులియమ్మా వరాల
తల్లి నీవే మావరాల తల్లివి నీవే
4. ఎత్తును కొండను చిత్తుగా జేసి
ఎలితి వమ్మా శ్రీ కనకమ్మా
ఈశ్వరీ జగదీశ్వరీ
రాజేశ్వరీ పరమేశ్వరి
శ్రీ కనకమ్మా సిరులియమ్మా వరాల
తల్లి నీవే మావరాల తల్లివి నీవే