పండుగలు, నోములు, వ్రతాలు జరిగినప్పుడు ముత్తైదువులకు తాంబూలం ఇవ్వటం హిందు సంప్రదాయాల్లో చాలా ముఖ్యమైనది. తాంబూలం ఇచ్చే పద్దతిలో కచ్చితమైన నియమాలు పాటించాలని పండితులు చెబుతుంటారు. తాంబూలంలో ఏవేవి ఇవ్వాలి..? అనే పద్ధతి పాటిస్తే ఆ ఫలితం దక్కుతుందో తెలుసుకుందాం..
ఆర్థిక స్తోమతను బట్టి జాకెట్టు ముక్కను కూడా ఇస్తే మంచిది. స్తోమతను బట్టి చీరా, జాకెట్లు పెడితే ఇంకా మంచిది. అలాగే తాంబూలంలో పువ్వుల్ని కూడా ఉండేలా చూసుకోవాలి. మరీ ముఖ్యంగా తాంబూలంలో పెట్టి ఇచ్చేటప్పుడు తమలపాకు తొడిమలు మన వైపు ఉండేలా అంటే.. తాంబూలం ఇచ్చేవారివైపుకు ఉండేలా చూసుకోవాలి. ముతైదువులకు పసుపు రాసికుంకుమ బొట్టు పెట్టి తాంబూలం ఇవ్వాలి. సాయంత్రం ఇచ్చినా కూడా చీకటి పడక ముందే తాంబూలం ఇవ్వడం ఎంతో మంచిది. మరీ ముఖ్యంగా తాంబూలం ఇచ్చేవారు కాళ్లకు పసుపు రాసుకుని..కుంకుమ బొట్టు పెట్టుకుని ఇవ్వాలని గుర్తు పెట్టుకోవాలి. తాంబూలం విషయంలో ఈ పద్ధతులు పాటించడం ఎంతో మంచి జరుగుతుందని పండితులు చెబుతారు.
తాంబూలంలో ఆరోగ్య రహస్యాలు..
సాధారణంగా మహిళలు ఎక్కువగా తడిలో తిరుగుతూ ఉంటారు. వంట చేయటం. సామాన్లు కడగటం. ఇల్లు కడుక్కోవటం లేదా తడిబట్ట పెట్టటం..బట్టలు ఉతకటం ఇలా ఎన్నో పనుల్లో భాగంగా శరీరానికి తడి తగులుతుంటుంది. మరీ ముఖ్యంగా కాళ్లకు, చేతులకు తడి తగలకుండా ఇటువంటి పనులు చేయటం కుదరదు. ఇలా తడిలో నానటం వల్ల వారికి దగ్గు,జలుబు, గొంతు సంబంధమైన సమస్యలతో పాటు కాళ్లకు పగుళ్లు వంటి సమస్యలు వస్తుంటాయి.
పసుపు యాంటి బయాటిక్ గా ఉపయోగపడుతుందనే విషయం తెలిసిందే. కాళ్లకు పసుపు రాసుకోవటం వల్ల పగలకుండా కాళ్లకు ఇన్ఫెక్షన్ కాకుండా ఉంటుంది. ఇక తాంబూలం విషయానికి వస్తే..తమలపాకు, వక్క, సున్నం కలిపి తాంబులం వేసుకుంటే నాలుక మీద ఉన్న చిన్న చిన్న బొడిపెల రిషి గుణాన్ని తగ్గిస్తుంది. తమలపాకులో సున్నం,వక్క కలిపి తింటే నాలుకకు సంబందించిన సమస్యలు తగ్గుతాయి.
తమలపాకులో 13 రకాల వ్యాధులను తగ్గించే గుణాలు ఉన్నాయని ఆయుర్వేద నిపుణులు చెబుతారు. హిందు సంప్రదాయంలో తమలపాకుకు చాలా ప్రశస్తమైన స్థానం ఉంది. అందుకే సంప్రదాయంతో పాటు ఆరోగ్యాన్ని అందించే విశిష్టత హిందు సంప్రదాయం ప్రత్యేకత. ముత్తైదువులకు తాంబూలం ఇచ్చే సమయంలో కాళ్లకు పసుపు రాసి తాంబులంలో ఆకు, వక్క, సున్నం మరియు రెండు అరటిపండ్లు, పూలు మరియు జాకెట్టు ఉండేలా చూసుకోవాలని చెబుతుంటారు.తాంబూలం ఇచ్చేటప్పుడు వారికి కుంకుమ బొట్టు పెడుతూ తాంబూలం వారికి ఇవ్వాలి.ఏది ఏమైనా మన పెద్దలు చెప్పిన విషయాలలో సంప్రదాయం మరియు ఆరోగ్యం దాగి ఉంటుందని గ్రహించాలి.
మన హిందూ సాంప్రదాయాల ప్రకారం తాంబూలం ఇవ్వడం అనేది చాలా సాంప్రదాయంగా వస్తున్నటువంటి ఆచారం మన ఇంటికి ఎవరైనా ముత్తైదువులు వస్తే వారు వెళ్లేటప్పుడువారికి తాంబూలం ఇవ్వడం చేస్తుంటాము అలాగే ఏదైనా పూజ కార్యక్రమాలు సమయంలోను శుభకార్యాల సమయంలోను వ్రతాలు చేసేటప్పుడు కూడా ఇంటికి వచ్చిన అతిథులకు తాంబూలం ఇస్తుంటాము ఇలా తాంబూలం ఇచ్చే సమయంలో ఎలా పడితే అలా ఇవ్వకూడదని, తాంబూలం విషయంలో కూడా కొన్ని నియమాలు పాటించాల్సి ఉంటుందని పండితులు చెబుతున్నారు.