ఉయ్యాలాలు గేటి వేళయై దేవీ
వేడుక తీరగ వేంచేయవే తల్లి
1. పన్నీటి జలకలా స్నానంబు గావించి
పట్టు పీతాంబరములు వింపుగా ధరియించి
కళ్ళ కాటుక పెట్టి నొసట తిలకము దిద్ది
పూలంకి సేవకు పూబోణి కూర్చుండ
ఉయ్యాలాలు గేటి వేళయై దేవీ
వేడుక తీరగ వేంచేయవే తల్లి
2. బంగారు ఊయెల పదిలముగా అమరించి
పట్టు పరుపుల పైనా మల్లి మాలలు పరచి
నీరజాక్షిగా నీకు నీరాజనము లిచ్చి
తిరువీధి వైభవము తిలకించు వేళయైనా
ఉయ్యాలాలు గేటి వేళయై దేవీ
వేడుక తీరగ వేంచేయవే తల్లి
3. జగమంతా నీ ఒడిలో డోలలూగించేవు
తరుగి నీ అలయాన ఊయ్యాల లూగేవు
కోటి జన్మముల ఫలము చేతికందిన వేళ
మురిపాల తల్లిని చూచి మురిసిపోయేటి వేళ
ఉయ్యాలాలు గేటి వేళయై దేవీ
వేడుక తీరగ వేంచేయవే తల్లి