_*అయ్యప్ప చరితం - 18🚩*_

P Madhav Kumar



🕉☘️🕉️☘️🕉️☘️🕉️☘️🕉️☘️🕉️


భక్తిప్రపత్తులతో గురువుగారికి పాదాభివందనం కావించాడు మణికంఠుడు. వినయం వుట్టిపడుతున్నది. మాటలతో ఇట్లా అడిగాడు.


*‘‘గురుదేవా ! విద్య నేర్పిన గురువుకు గురుదక్షిణ సమర్పించుకోకపోతే ఆ శిష్యుని జీవితం నిర్థకవౌతుంది ! మీకు నేను ఏమి సమర్పించినా అది మీరు నేర్పిన విద్యకు , నాపట్ల చూపిన వాత్సల్యానికి సరికాదు ! దయయుంచి నేనేమి ఇవ్వమంటారో మీరే సెలవిచ్చి నన్ను ధన్యుడిని చేయండి!’’*

ఆ మాటలు విని కొద్దిసేపు ఏదో ఆలోచిస్తూ వుండిపోయాడు గురువు.

*‘మణికంఠుడు సామాన్య మానవ బాలుడు కాదనీ , కారణ జన్ముడని తన మనస్సు చెబుతున్నది ! నా తలపు తప్పుకాకపోవచ్చును ! ఈ విధంగా అడిగి చూస్తాను ఏం చేస్తాడో చూస్తే తన అంచనా నిజవౌతుంది!’* అనుకుంటూ ఒక నిర్ణయానికి వచ్చి లోపలకు వెళ్లాడు !

ఆశ్రమంలో ఒక మూలగా కూర్చుని వున్న పదేళ్ల కుమారుడిని చేయిపట్టి నడిపించుకుంటూ బయటకు తీసుకువచ్చాడు.


*‘‘మణికంఠా ! ఈ నా పుత్రుడు మూగతనంతో , అంధత్వంతో , చెవిటితనంతో పుట్టి మాకు తీరని దుఃఖాన్ని ప్రసాదించాడు ! ఈ సంగతి నీకు కూడా తెలుసును గదా ! పూర్వజన్మలో చేసిన పాపానికి ఈ విధమైన శిక్షననుభవిస్తున్నాడీ జీవుడని తెలిసినా పుత్ర వ్యామోహం నన్నీ విధంగా అడగటానికి పురికొల్పుతున్నది ! నాయనా ! నా కుమారుని ఆరోగ్యవంతుని చేయగలవా?’’* అని అడిగాడు రుద్ధకంఠంతో ! చిన్నగా నవ్వి ఆ బాలుడి దగ్గరకు వెళ్లి కళ్లను , చెవులను, ముఖాన్ని తడిమి *‘‘నీ పాపాలు ఈనాటితో పరిహారమైనాయి. గురుపుత్రా! ఇలా చూడు’’* అన్నాడు మణికంఠుడు గంభీరంగా.

గురుపుత్రుడు మణికంఠుని వైపు చూస్తూ నిలిచాడు ! అతనికి జ్యోతి రూపంలో కనిపించాడు మణికంఠుడు ! ఆ జ్యోతిలో నుండి ఓంకార నాద తరంగాలు గురుపుత్రుని చెవిలో ప్రవేశించాయి ! నోటినుండి అప్రయత్నంగా మాటలు వెలువడ్డాయి !

*‘‘జ్యోతి రూపంలో దివ్యంగా ప్రకాశిస్తున్న పరమాత్మా నీకు నా ప్రణామాలు ! ఓంకారనాదం నీ నుండి వెలువడింది. ఆ నాదం నాకు స్పష్టంగా వినిపిస్తున్నది ! ఈ మాటలు నీ అనుగ్రహంవల్లనే నా నుండి వెలువడుతున్నాయి ! నాకు మీ దర్శనభాగ్యం , ఓంకార నాదాన్ని వినే భాగ్యం , మాట్లాడే సామర్థ్యం ప్రసాదించిన ఓ జ్యోతి స్వరూపా ! నీకివే నా కోటి కోటి ప్రణామాలు!’’* అంటూ నమస్కరించాడు.

గురువు ఆనందం వర్ణనాతీతం !

*‘‘మణికంఠా ! నీవే పరమాత్ముడవు ! ఈ రూపంలో మా మధ్య వుంటున్న నిన్ను చూస్తూ నీతో కాలం గడిపే అదృష్టాన్ని అనుగ్రహించావా స్వామీ ! వేదాలు , పురాణాలు , శృతి శాస్త్రాలు అన్నీ నీలోనే నిక్షిప్తమై వుండగా నీకు నేను గురువుగా నేర్పాననుకోవడం భావ్యం కాదు ! నీవే అందరికీ బ్రహ్మజ్ఞానాన్ని అందించగల సమర్థుడివి ! హే ! ఓంకార రూపా ! మాకు బ్రహ్మజ్ఞానం గూర్చి తెలియజెప్పి మమ్మల్ని అనుగ్రహించు!’’* అని వేడుకున్నాడు భక్త్యావేశంతో పులకించిపోతూ !

వాళ్లిద్దరి వైపు ప్రసన్నంగా చూసాడు మణికంఠుడు ! గురువు కోరినట్లు బ్రహ్మజ్ఞానం గూర్చి ఉపదేశించాడు !

మణికంఠుని ఉపదేశము

*‘‘గురువర్యా ! గురుపుత్రా ! ఈ సృష్టి సర్వానికి మూలమైన భగవంతుడు నిరాకారుడు ! జ్యోతి రూపంలో దర్శనమిస్తాడు జ్ఞాన నేత్రాలకు ! సృష్టి విస్తరణ కోసం ప్రకృతి పురుషులుగా ప్రకటితమై ప్రాణికోటిని సృష్టిస్తాడు బ్రహ్మరూపంలో ! ఆ ప్రాణకోటిని విష్ణువుగా పోషించి , పాలించి తిరిగి శివుని రూపంలో అంతం కావిస్తుంటాడు.

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏


#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat