*🌻2.తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఉత్సవములు🌻*
*🌻ఆర్ద్ర నక్షత్రోత్సవము🌻*
🍃🌹అఖిల భువన నియన్తయై దయాసాగరుడైన, శ్రీవైకుంఠా ద్రియని ప్రఖ్యాతి గాంచిన పర్వతరాజమగు తిరుమలయందు అర్చావతారమున వేంచేసియున్న శ్రీ వేంకటేశ్వరస్వామివారి సన్నిధానమున యతిరాజగు శ్రీ భాష్యకార్లవారికి ఆర్ద్రనక్షత్ర దినోత్సవము జరుగును.
🍃🌹ఈ దినమున శ్రీస్వామివారికి మాధ్యాహ్నికారాధనము పూర్తి అయిన పిమ్మట శ్రీ మలయప్పస్వామివారు రంగమండపమునకు వేంచే సెదరు. అచ్చట ఆర్జితములగు ఉత్సవములు పూర్తి అయిన తరువాత ఆర్ద్రనక్షత్రోత్సవమునకై తిరుచ్చినదిష్ఠించి మహాద్వారమువద్దకు వేంచేసేదరు. శ్రీ భాష్యకారులవారు మరియొక తిరుచ్చిలో వేంచేసి శ్రీ స్వామివారికి ఎదురుగా వచ్చెదరు. అప్పుడు శ్రీవారికి హారతి జరిగి శేషహారతి పుష్పసరము శఠారి మర్యాదలు శ్రీభాష్యకారులవారికి జరుగును.
🍃🌹తరువాత శ్రీ స్వామివారున్నూ శ్రీవారికి ఎదురుగా శ్రీభాష్యకారుల వారున్నూ తిరువీథులలో ఉత్సవమునకు వేంచేయు దురు. ఉత్సవములో గుర్రాలపాగా వద్ద నుంచి దివ్య ప్రబంధ పారాయ ఇము జరుగుచుండును. తిరువీథుల ఉత్సవము పూర్తి అయి మహాద్వా రమునకు వేంచేసినప్పుడు శ్రీవారికి హారతి అయి ఇహల్ గోష్ఠికి శఠారి సాయించెదరు. పిమ్మట శ్రీవారు విమాన ప్రదక్షిణముగా శ్రీభాష్యకారులవారి ఆలయముఖ మంటపమునకు వేంచేసెదరు. శ్రీభాష్యకారులవారు వారి సన్నిధిలోనికి వేంచే సెదరు. అనంతరము శ్రీవారికి నివేదనము అయి హారతి జరుగును.
🍃🌹ఆ శేషహారతి శఠారి శ్రీభాష్యకారులవారికి మర్యాద జరుగును. తరువాత శ్రీస్వామివారికి నివేదింపబడిన ప్రసాదములు స్థానబహుమాన పూర్వకముగా గోష్ఠికి భక్తజనులకు వినియోగము చేయబడును. అనంతరము' శ్రీస్వామివారు శ్రీవారి సన్నిధానమున స్వస్థానమునకు వేంచేసెదరు.
*🌻8. పునర్వసు నక్షత్రోత్సవము🌻*
🍃🌹అఖిలభూతరక్షాపరాయణులై (తిరుమల) వేంకటగిరియందు వేంచేసియున్న శ్రీ వేంకటేశ్వరస్వామివారి సన్నిధానములో శ్రీ సీతా లక్ష్మణులతో సాక్షాత్కరించుచున్న శ్రీరామచంద్రస్వామివారికి ప్రతి పునర్వసు నక్షత్రమునందును ఉత్సవము జరుగును.
🍃🌹ఆ పునర్వసు నక్షత్రదినమునందు శ్రీ వేంకటేశ్వరస్వామివారికి ప్రాతఃకాలారాధనము, మాధ్యాహ్నికారాధనము పూర్తి అయిన పిదప శ్రీ సీతారామలక్ష్మణ పెరుమాళ్లను బంగారు తిరుచ్చి యందు వేంచే యింతురు. వారలకు పట్టువస్త్రముల చేతను, తిరువాభరణముల చేతను, మనోహరములగు పుష్పమాలిక లచేతను చక్కగా అలంకారము జరుగును. శ్రీరామభక్తా గ్రేసరుడగు శ్రీ ఆంజనేయస్వామివారిని వేరొక తిరుచ్చి యందు వేంచేపుచేసి వస్త్రాభరణ పుష్పమాలికలచే నలంకారము జరుగును.
🍃🌹పిమ్మట శ్రీస్వామివార్లకు హారతి జరుగును. వెంటనే ఆనం దనిలయ విమాన ప్రదక్షిణముగా తిరువీధులు ఉత్సవమునకు శ్రీస్వామి వార్లు వేంచేయుదురు. సకలపరివారములతోను సకల వాద్యములతోను భక్తబృందములతోను వేదపాఠకులతోను, దివ్య ప్రబంధపాఠకులతోను క్రమముగా మహా ప్రదక్షిణముగా ఉత్సవముతో శ్రీవారి సన్నిధి కి వేంచే యుదురు. అచ్చట శ్రీ స్వామివార్లకు ఆరాధనము ప్రసాద నివేదనము జరిగి హారతి జరుగును. పిమ్మట పుష్పసరము, శేషహారతి శ్రీ ఆంజ నేయస్వామివారికి జరుగును.
🍃🌹పిమ్మట జియ్యంగారు వారికిని, సర్కారు వారికిన్ని మఠం వారికిని బహుమానము జరిగి వెంటనే చందన తాంబూల ప్రసాద వినియోగము స్థానబహుమాన పూర్వకముగా జరుగును. తరువాత శ్రీ స్వామివారు సన్నిధి లోకి వేంచేయుదురు.
*🌻9. శ్రవణ నక్షత్రోత్సవము🌻*
🍃🌹సకల చరాచర నియన్తయై (తిరుమల) శ్రీ శేషభూధరమున వేంచేసియున్న శ్రీ వేంక టేశ్వర స్వామివారి శ్రవణనక్షత్రము అవతార నక్షత్రముగాన ప్రతి శ్రవణ నక్షత్రమందును ఉత్సవము జరుగును.
🍃🌹ఈ శ్రవణ నక్షత్ర దినమున ఉదయం శ్రీవారికి తోమాల అయిన పిమ్మట శ్రీమలయప్ప స్వామివార్లకు పట్టమహిషీలగు ఉభయ తిరుమంజనము జరుగును.
🍃🌹నాంచార్లవారికి మాధ్యాహ్నికారాధనము పూర్తి అయిన పిమ్మట శ్రీమలయప్ప స్వామివారు పట్టమహిషులతో, భక్త జన ప్రార్థనా పరిపూర్తికై కల్యాణమండపము (అనగా రంగమండపము)నకు వేంచేయుదురు. అచ్చట భక్త జన కామితములను పూర్తి యొన రించిన పిదప తమ అవతార నక్షత్రోత్సవమునకై పట్టమహిషులతో బంగారు తిరుచ్చి యందు వేంచేయుదురు. విశేష రత్నాభరణములతోను విశేషములగు పట్టువస్త్ర ములతోను పుష్పమాలికలతోను అలంకారము జరుగును.
🍃🌹తరువాత కర్పూరహారతి జరిగి, శ్రీ జియ్యంగారు వారికి, సర్కారు వారికి శఠారి అయి విమాన ప్రదక్షిణము సకల పరివారముతో విమాన ప్రదక్షిణముగా చతుర్వీడుల ఉత్సవమునకు సర్వపాప సంచయ నివర్తక మగు దర్శనము భక్తబృందమున కందచేయుచు బయలుదేరెదరు. వేదధ్వానము లొకవంక దివ్య ప్రబంధరావము లొకవంక గోవింద ధ్యానము లొకవంక కర్ణములదూరి పాపపుంజముల పారద్రోలుచుండ శ్రీవారు పట్టమహిషీ సమేతముగా దర్శనమిచ్చి నేత్ర సాఫల్యమును చేయుచుండ యాత్రికుల అదృష్టమేమని చెప్పవచ్చును. అది వాచామగో చరము. ఇట్లా చతుర్వీథులు ఉత్సవము జరిగి, బంగారువాకిలి వద్దగల ఆస్థానమండపమునకు శ్రీవారు వేంచేయుదురు.🍃🌹అచ్చట శ్రీవారికి ఆరాధనము ప్రసాద నివేదనము జరిగి హారతి అయి జియ్యంగారు వారికి సర్కారు వార్ల బహుమానం జరిగి ఆస్థాన బహుమాన పూర్వకముగా గోష్ఠికి వినియోగము జరుగును. శ్రీవారు సన్నిధిలోకి వేంచేయుదురు.
*🙏ఓం నమో వేంకటేశాయ🙏*