*🌻2.తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఉత్సవములు🌻*
*🌻12. వసంతోత్సవము🌻*
🍃🌹అఖిలజగదుద్భవ స్థితిలయకారకుడై శ్రీ వేంకటాద్రియందు అర్చావతారమున వేంచేసియున్న శ్రీ వేంకటేశ్వరస్వామివారికి ప్రతి సంవ త్సరము వసంతర్తువునందు చైత్రమాసమున శుద్ధ త్రయోదశీ చతుర్దశి పూర్ణిమ ఈ మూడు దినములు ఉత్సవములు జరుగును. ప్రథమ దిన మున శ్రీవారికి ప్రాతఃకాలారాధనము మాధ్యాహ్నికారాధనము అయిన పిమ్మట శ్రీమలయప్ప స్వామివారు శ్రీ భూదేవులతో బంగారు తిరుచ్చిలో వేంచేసి తిరువీథుల ఉత్సవములో ఆలయమునకు పశ్చిమ భాగమున యున్న వసంతమండపమునకు వేంచేయుదురు.
🍃🌹అచ్చట శ్రీవారికి ఆరాధనము జరిగి పిమ్మట అభి షేకము అలంకారము జరుగును. సాయంకాలము ఆస్థానము జరిగి ఉత్సవముతో శ్రీవారిసన్నిధానమునకు వేంచేయుదురు.
🍃🌹రెండవదినము శ్రీమలయప్పస్వామివారు శ్రీభూదేవులతో కూడ ఆరాధనము జరిగి ఉదయమే వెండి రథము నధిరోహించెదరు. ఆ రథోత్సవము పూర్తి అయిన పిమ్మట ఆ రథమును వీడి . వసంత మండపమునకు వేంచేయుదురు. అచ్చట ఆస్థానము జరిగి అభి షేకము అలంకారము జరుగును. సాయంకాలము ఆస్థానము జరిగి ఉత్సవ ముతో తిరువీథులు వేంచేసి శ్రీవారి సన్నిధానమునకు వేంచేయుదురు.
🍃🌹మూడవదినమున ఆరాధనము అయిన పిమ్మట శ్రీ మలయప్పస్వామి వారు శ్రీభూదేవులతో కూడ ఒక తిరుచ్చిలోను, శ్రీసీతా రామ లక్ష్మణులు వేరొక తిరుచ్చిలోను శ్రీరుక్మిణీ సమేతముగా శ్రీకృష్ణస్వామివారు వేరొక తిరుచ్చిలోను శ్రీ ఆంజనేయస్వామివారు మరి యొక తిరుచ్చిలోను వేంచేసి తిరువీథుల ఉత్సవముతో వసంతమండప మునకు వేంచేయుదురు. అచ్చట శ్రీవార్లకు ఆస్థానము, అభిషేకము,అలంకారములు జరుగును.
🍃🌹సాయంకాలమున త్రేతాయుగవతారమగు శ్రీరామచంద్ర చక్రవర్తిస్వామివారు ద్వాపరయుగా వతారమగు శ్రీకృష్ణస్వామి వారు కలియుగ ప్రత్యక్షార్చావతారమగు శ్రీ వేంకటేశ్వరస్వామివారు ఆస్థానముతో వేంచేసియుండ దర్శించిన భక్త కోటి యొక్క నేత్ర సాఫల్యము యెంతగా తలంచవలెను. వారి అదృష్టము ప్రమాణాతీత ముగా భావించవలెను. అపూర్వ సంఘటనము శ్రీస్వామివార్లు ఆస్థా నము పూర్తి అయిన తరువాత సమస్తపరివారములతోను భక్తబృందము తోను తిరువీథులు.
🍃🌹ఉత్సవముతో వేంచేసి శ్రీవారి సన్నిధానమున ప్రవేశించెదరు. ఈ ఉత్సవము వసంతరువునందు జరుగును, గాన వసంతోత్సవము అనియు సమస్తకామితములను సమకూర్చగలదనియు ఆగమములు చెప్పుచున్నవి.
*🙏ఓం నమో వేంకటేశాయ🙏*