*🌻2.తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఉత్సవములు🌻*
*🌻24. డోలోత్సవము (ఊంజల్ సేవ)🌻*
🍃🌹అఖిల భువన జన్మస్థితి లయకర్తయై చేతన సంరక్షణార్థము (తిరుమల) శేషాద్రియందు అర్చావతారమున వేంచేసియున్న శ్రీ వేంకటేశ్వరస్వామి వారికి ప్రతి సంవత్సరము కన్యామాసము నందుగాని, ఆశ్వయజ మాసమున నవరాత్రులు యందుగాని జరుగు బ్రహ్మోత్సవము నందు ప్రతిదినము రాత్రులయందు వాహనోత్సవము జరుగుటకు ముందుగా శ్రీవారి ఆలయమునకు ముందుగల తూర్పు వీదిలోని డోలామండపమునందు, సువర్ణ రత్నాభరణ కౌశేయాది విభూషితులై పుష్పమాలాలంకృతులైన ఉత్సవ శ్రీనివాసమూర్తియగు శ్రీ మలయప్పస్వామి వారు దివ్యాలంకార విభూషితులగు పట్టమహిషులతో కూడుకుని, ప్రాధక్షిణ వీథుల యందున, సోపానములయందును ఉండి వేలాది యాత్రికభక్తజనులు బంధు మిత్ర కళ త్రాదులతో నిర్నిమేషులై ఆనందపరిపూర్ణులై తదేక దృష్టితో సేవించుచుండ డోలావిహారము చేయుదురు.
🍃🌹ఇది డోలోత్సవము (ఊంజలి సేవ) లీలారసాస్వాదన లోలుపులైన పట్టమహిషులతో కూడుకొనిన శ్రీ స్వామివారి ముఖోల్లాసార్థము చేయు డోలోత్సవము (ఉయ్యాల సేవ) దిదృక్షువులగు భక్త జన ) సముదాయములకు ఆనందాతిరేకమును, భక్తి పరాకాష్ఠను, శ్రద్ధాతిశయమును, వాంఛితార్థ సిద్ధిని కలుగచేయునని శాస్త్రములు చెప్పుచున్నవి.
*🙏ఓం నమో వేంకటేశాయ🙏*