*🌻2.తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఉత్సవములు🌻*
*🌻25. విజయదశమీ పార్వేట ఉత్సవము🌻*
🍃🌹అఖిల బ్రహ్మాండ చక్రవర్తియగు తిరుమలయందు వేంచేసియున్న శ్రీ వేంకటేశ్వరస్వామివారికి ప్రతి సంవత్సరము విజయదశమి దినమునందు పార్వేట (పారువేట) ఉత్సవము జరుగును.
🍃🌹శ్రీస్వామివారికి ప్రాతఃకాలారాధనము, మాధ్యాహ్నికారాధనము పూర్తి అయిన పిమ్మట, శ్రీమలయప్పస్వామివారు తిరుచ్చి యందు వేంచే సెదరు. శ్రీవారికి విశేషాభరణముల చేతను విశేషదుకూలముల తోను, పుష్పసరములతోను అలంకారము జరిగి హారతి జరుగును. వెంటనే నేరుగా పరివారముతో తాళ్ళపాకవారి పార్వేట మండవమునకు వేంచేయుదురు.
🍃🌹అచ్చట శ్రీస్వామివారికి ఆరాధనము తలియలు నివేద నము జరుగును. పిమ్మట తాళ్ళపాకంవారి హారతి జరిగి తాళ్ళపాకం వారికి మర్యాదలు జరుగును. పిమ్మట శ్రీవారికి ఆరగింపు జరిగి ప్రసాదములు స్థాన బహుమాన పూర్వకముగా గోష్ఠికి వినియోగము చేయబడును. శ్రీస్వామివారు పార్వేటపూర్తి యొనరించుకుని నేరుగా మహాద్వారము వద్దకు వేంచేయుదురు. అచ్చట హత్తీరాంజీ మఠంవారి హారతి జరిగి ఆ తిరుచ్చిలోనే పరివారములతో తిరువీథులు ఉత్సవముగా వేంచేసి మహాద్వారమునకు వచ్చి సన్నిధికి వేంచేయుదురు.
*🙏ఓం నమో వేంకటేశాయ🙏*