*భీమునికి హనుమ చూపిన విశ్వ రూపం:*
— కాల లక్షణాలు ,కలియుగ లక్షణా లు హనుమ బోధిమ్పగా భీముడు విని ,ఆనందం తో ”అన్నా ఆంజనేయా !
భయం కలిగించే ఈ కలి ప్రభావం నుంచి ,తప్పించు కొనే ఉపాయం వుంటే బోధించు ”అని దీనం గా అడిగాడు .దానికి మారుతి ,కుంతీపుత్రునికి ”సోదరా !నేనే భవిష్యత్ బ్రహ్మను .నన్ను ఆరాధించి ,నా నామ స్మరణ చేసిన వారికి కలి దోషాలేవీ అంటవు .నాకు నా భక్తులంటే చాలా ఇష్టం .”ఆంజనేయా ”అని ఒక సారి పిలిస్తే చాలు ,వారిని ఆదు కొంటాను . .ఆపన్నులను రక్షించే బాధ్యత నేను తీసు కొంటాను .”అని చెప్పాడు .భీముని భయం తొలగింది .మళ్ళీ ”అన్నా !ప్రళయం తర్వాత జరిగే సృష్టికి నువ్వే కర్తవు అని తెలిసి ఆనందిస్తున్నాను .కాలా తీతుడివి .జనన మరణాలు లేని వాడివి .చిరంజీవి వి .నీకు ముసలి తనం లేదు .లోకాలను భ్రమింప జేస్తున్నావు అంతే .నువ్వు వానరుడవు కాదు ,సాక్షాత్తు పరమేశ్వరుడివి .నేను నీ కిన్కరుడిని .నా మీద దయతో నీ విశ్వ రూప సందర్శన భాగ్యం నాకు కల్పించు ”అని వేడు కొన్నాడు .దానికి హనుమ సంతోషించి ఆ దివ్య విభూతిని చూపిస్తున్నాడు
‘ ”ఆకాశము ,దిక్కులు ,తానె అయి ,తోక నక్షత్రాలను తాకగా ,దుర్ని రీక్షుడై గోచ రించాడు .భీముని మేను వణి కింది . .గద్గద స్వరం తో ఎన్నో విధాల స్తుతించాడు .”చిరంజీవీ !పరమాద్వ్భుతం నీ రూపం .కోటి సూర్యులు ఉదయించి నట్లుంది ,నీ తోక కది లిస్తే నాకం కని పిస్తోంది .ఇంక చూసే ధైర్యం లేదు .కళ్ళు మిరు మిట్లు గొలుపు తున్నాయి .దయ చేసి నీ విశ్వ రూపాన్ని ఉపసంహరించు ”అని ప్రార్ధించాడు .ఆంజనేయ స్వామి అనుగ్రహించి మళ్ళీ మామూలు రూపం లో కి వచ్చే శాడు .
తేరు కొన్న భీముడు ”లోక బాంధవా !నక్షత్రాలు నీ నీ మొల పూసలా .లేక పాదాల గజ్జలా అనట్లున్నాయి .కుల పర్వ టాలు నీకు పూల దండల్లా వున్నాయి .సముద్రం నీకు ఆవు పాదం అంత .రాక్షసులు కీట కాలు .నీ లాంటి వాడు తోడూ గా వున్నాడు కనుకే శ్రీ రామునికి దశ కన్తుడు అయిన రావణా సురుణ్ణి సంహరించటం తేలిక అయింది” అని మెచ్చాడు .
దానికి హనుమ ”నా తమ్ముడివి నువ్వు .నన్ను ఇంతగా స్తుతించ కూడదు .నువ్వు వచ్చిన పనేమిటో నాకు తెలుసు .ఆ వనం దేవతల స్వాధీనం లో వుంది .నువ్వు గొప్ప సాహసమే చేశావు .దేవతలు ,ధ్యాన ,దాన ,హోమ ,తంత్ర ,మంత్ర ,తపోవిదాన ,భక్తీ ,బలి ,తర్పణ మొదలైన వాటికే వశం అవుతారు .బల గర్వాలకు వశం కారు .పెద్దల అనుమతి లేకుండా ఏ పనీ చేయ రాదు .అలా చేస్తే కస్టాలు చుట్టూ ముట్టు తాయి .దేశ ,కాలాలను పరిగణన లో కి తీసుకొని ప్రయత్నించాలి .కేవలం బల ప్రదర్శన చేస్తే భంగ పాటు తప్పదు .నీ కార్యం నిర్విఘ్నం గా నెర వేరు తుంది .నువ్వు అతి ధైర్య శాలి వైనా ఒక వరం నీకు ప్రసాదిస్తునాను ‘దుర్బుద్ధి తో మీ రాజ్య సంపదను లాక్కొన్న దుర్యోధనుడు మీ రాజ్య భాగం మీకు ఇవ్వడు .మీ సంధి ప్రయత్నాలేవీ ఫలించవు .కురు పాండవ యుద్ధం అని వార్యం అవుతుంది .మిమ్మల్నే విజయ లక్ష్మి వరిస్తుంది .సాక్షాత్తు భగవాన్ శ్రీ కృష్ణుడే ధర్మ పక్ష పాతి కనుక మీ వై పే ఉంటాడు .ఇంక ఆలశ్యం చెయ్యక వెళ్ళు .సౌగంధిక పుష్పాలుండే వనానికి దారి ఇదే ”అని భీముణ్ణి గాడ్హం గా ఆలింగనం చేసు కోని ,దీవించి ,అంతర్ధానమయాడు పవన సుత హనుమాన్ .భీమునికి వెయ్యి ఏనుగుల బలం వచ్చింది .యక్ష ,రాక్షసాడులను జయించి సౌగంధిక పుష్పాలను తెచ్చి ద్రౌపదీ దేవికి ఇచ్చి ,ఆమె ముచ్చట తీర్చ టానికి అక్కడి నుండి బయలు దేరాడు అందరిని జయించి సౌగంధిక పుష్పాలను తీసుకొని పాండవులను చేరు కోని వాటిని ప్రేమ గా ద్రౌపదీ దేవికి ఇచ్చి,ఆమె కోరిక తీర్చి ఆనందన్తింప జేశాడు .
*సశేషం.....*