🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️
*శ్రీ స్వామి అయ్యప్ప దీక్ష - శాస్త్రీయ అవగాహన - 6*
☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️
యోగసాధనతో ఈ షట్చక్రములను , "కుండలిని" శక్తిని మేల్కొలిపిన సాధకునకు సర్వసిద్ధులు సమకూరుటయేగాక భగవత్ సాక్షాత్కారము నొంది ముక్తి పథముగాంచును. అతిముఖ్యమైన , క్లిష్టమైన నియమము బ్రహ్మచర్యము. బ్రహ్మచర్యమే అన్ని ఆధ్యాత్మిక సాధనలకు పునాదివంటిది. కేవలము స్త్రీ సాంగత్యమునకు దూరముగానుండుటయే బ్రహ్మ చర్యము. అని అనేకుల అభిప్రాయము. కానీ అధికాదు. మనసా , వాచా , కర్మణా ఈ నియమములను పాటించుచూ , పసిపాపవలె నిర్మలముగా , నిశ్చలముగా , చిరుదరహాసముతో , ఊహలలో సైతము కామ వాంఛకులోనుగాక యుండుటే పరమోత్కృష్ట బ్రహ్మచర్యమునకు పరమావధి శ్రీ స్వామి
అయ్యప్ప దీక్షలో భక్తులు పాటించే అత్యంత క్లిష్టమైన నియమమూ , సాధకుని విజయ సోపానము వైపు పయనింపజేసి , మోక్షమార్గము నకు దివ్యత్వ సాధనకు ఉపకరించు ప్రథమ సోపానము బ్రహ్మ చర్యమే.
మానవ శరీరములోని ప్రతి అవయవమూ రక్త ప్రసరణము ద్వారా నియంత్రితమగుచున్నది. వైద్య సిద్ధాంతము ప్రకారము రక్తము క్షారగుణము , ఆమ్లగుణము కలవని నిర్ణయించిరి. క్షారగుణము కలిగిన రక్తము శరీరమునకు శక్తినిచ్చి , రోగ క్రిములను సంహరించి , రోగ నిరోధక శక్తిని పెంపొందించును. ఆమ్లగుణము కల్గిన రక్తము అవయవములను పోషించి , మానవ యంత్రము సరియైన పనిజేయు స్థితిలోనుంచి , శారీరకముగా , మానసికముగా , సమకాలీన స్థితిలో నుంచును. అందువలన సాత్విక ఆహారసేవనయే జీవునియొక్క భౌతిక శక్తిని పెంచి , ఆధ్యాత్మిక జీవనమునకు అవసరమైన ఏకాగ్రత , నిశ్చల మనోతత్వములను ప్రసాదించుచున్నవి.
ధూమపానము , మద్యపానము , నిషేధించుట నియమములలో నొకటి. పొగ త్రాగుట వలన , మద్యపాన సేవన వలన జీర్ణకోశమూ , శ్వాసావయవములు , కేంద్ర నాడీమండలము , నరాశయములు దెబ్బతిని వ్యక్తి స్వాస్థ్వము కోల్పోవును. మార్సిన్ , పెతిడిన్ , హీరాయిన్ వంటి మత్తు మందుల సేవన నవనాగరిక సమాజములో పెచ్చు పెరిగిపోయినది. మత్తుమందులకు బానిసలైనవారికి శరీరము సహజకాంతి , పటుత్వమును కోల్పోయి , శారీరక , మానసిక దుర్భలత్వములకులోనై ఆలోచనాశక్తి నశించి మృతప్రాయులై సంఘమునకు తుదకు తమకు తామే అపకారము కల్గించు కుంటున్నారు. పొగత్రాగుట వలన నోటికి , ఊపిరి తిత్తులకు సంబంధించిన క్షయ , కేన్సర్ వ్యాధులు విపరీతముగా స్వైరవిహారము చేయుచున్నవి. మద్యపాన ప్రియులలో జీర్ణకోశము , లివర్ , కాలేయము , ప్రేవుల సంబంధమైన వ్రణములు , కేన్సర్ వంటివి ఏర్పడి అనేక బాధలను అనుభవించుచున్నారు. ఇంతేకాక అనేక నరముల , రక్తనాళముల సంబంధిత వ్యాధులు ఈ దురలవాట్ల కారణముగా ప్రబలుచున్నవి. అందువలన ప్రతివ్యక్తీ తనశరీర ఆరోగ్యమును , మానసిక ధారణాశక్తిని కాపాడుకొనవలెనంటే ఈ దురలవాట్లను తప్పనిసరిగా విసర్జించవలయును.
భూమిపై పరుండుట ఒక నియమము. నేలపై తలక్రింద దిండులేకుండా వరుండుట అనునది యోగాసనములలో “శవాసనము"ను పోలియున్నది. ఈనాడు అనేకులు నడుమునొప్పి , వెన్ను నొప్పి , మెడపూసలలో నొప్పి , తుంటెజాలు నొప్పి (Sciatica), చేతిలోజాలు నొప్పి (Brachid Newlgia) మొదలగు అనేక రకములైన వ్యాధులలో వైద్యులు తమ రోగులకు మందులు ఏమి ఇచ్చినప్పటికీ తప్పనిసరిగా వ్యాయామము మరియు గట్టిబల్ల లేక నేలపై పడుకోవలసినదిగా సలహాయిస్తున్నారు. దీనివలన అనేకులకు బాధానివారణ జరుగుచున్నది. ఈ పద్దతి ద్వారా ఆవయములకు మంచి విశ్రాంతి లభించి , మంచి నిద్రప్రాప్తించును. భూమికి గల అయస్కాంత శక్తి , ఆకర్షణశక్తిల కారణముగా , భూమిపై పరుండుట వలన శరీరమునకు రేడియోధార్మిక శక్తులు లభించి , శరీరమునకు , ఉత్తేజకరమైన విద్యుత్ తరంగముల ద్వారా మానసిక ప్రశాంతత , సుఖనిద్ర లభించును. అందువలన నేలపై పరుండుట యోగాసనములలో చెప్పబడిన ఒకప్రక్రియగా నెంచి , కొంత వ్యాయాయము కూడా చేస్తూ వుండినయెడల సాధకునకు ఎంతోమేలు చేకూరును. మరియూ నిత్యకృత్యములలో *"సత్యవ్రతము"* చాలా ముఖ్యమైనది. ఇందుకు *"వాక్ శుద్ధి"* ముఖ్యము. నిజము చేదుగా వుంటుంది. అబద్దము తీయగా వుంటుంది. అయినా , నొప్పింపక తానొవ్వక సత్యమునే పలుకుటలో ఎంతో గొప్పతనమున్నది. శరీరమునకు బాహ్యముగా కలిగించు బాధలకన్నను , పరుష వాక్యములచే మనసుకు కల్గు బాధయే హెచ్చు. అందువలన సాధకులు , భక్తులు , తప్పని సరిగా తీవ్ర పదజాలమును ప్రయోగించుట మాను కోవలయును. అందు కొరకై నిత్యము భగవన్నామ స్మరణము చేయుట (శరణుఘోష ఎంత ఎక్కువ చేసిన అంత మంచిదని చెప్పుట ఇందులకే) పురాణ గ్రంధ పఠనము , సత్సాంగత్యము , ఆధ్యాత్మిక ప్రవచన గోష్టిలలో పాల్గొనుట ద్వారా మనస్సును స్వాంతణనపరచి , ప్రశాంత చిత్తముతో సత్య ప్రవర్తనాచరించుటకు వాక్ శుద్ధినల వరచుకొనుటకు సహ కరించును.
*(సశేషం)*
*ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప*
*శ్రీ ధర్మశాస్తావే శరణం అయ్యప్ప*
*శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణువే*
*అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకనే శరణం అయ్యప్ప*
*లోకాః సమస్తా సుఖినోభవంతు*🌹🙏🌸