1.శ్రీ కాత్యాయని - ఎక్కినాది పల్లకి
శ్రీ లలితాంబిక - ఎక్కినాది పల్లకి
కంచి కామాక్షి, మధుర మీనాక్షి బెజవాడ దుర్గమ్మ ఎక్కినాది పల్లకి
॥మల్లెపూల॥
2. నిండుముత్తైదువ - ఎక్కినాది పల్లకికంచిపట్టు చీరగట్టి - ఎక్కినాది పల్లకి
అభయ స్వరూపిణి ఆనంద దాయిని శ్రీ కనక దుర్గమ్మ ఎక్కినాది పల్లకి
॥మల్లెపూల॥
3.నాద స్వరూపిణి - ఎక్కినాది పల్లకిబిందు కళాధరి - ఎక్కినాది పల్లకి
ముగ్గరమ్మలకు మూల పుటమ్మ శ్రీ కనక దుర్గమ్మ ఎక్కినాది పల్లకి
॥మల్లెపూల॥
శ్రీ చౌడేశ్వరి - ఎక్కినాది పల్లకిశ్రీ భ్రమరాంబిక - ఎక్కినాది పల్లకి
మహిమ స్వరూపిణి మంగళదాయిని మన కనక దుర్గమ్మ ఎక్కినాది పల్లకి
॥మల్లెపూల॥
5. చాముండేశ్వరి - ఎక్కినాది పల్లకివాసవీ కన్యకాంబ - ఎక్కినాది పల్లకి
సురచిర ధరసుర మందహాసిని శ్రీ కనకదుర్గమ్మ ఎక్కినాది పల్లకి
ఈ పాటను ఎలా పాడాలో ఇక్కడ టచ్ చేసి వినండి.
