17. జయ జయ జయ వినాయక జయములీయవా స్వామి - Jaya Jaya Jaya Vinayaka - వినాయక భజన పాటల లిరిక్స్
Read in: తెలుగు | ಕನ್ನಡ | தமிழ் | देवनागरी | English | മലയാളം

17. జయ జయ జయ వినాయక జయములీయవా స్వామి - Jaya Jaya Jaya Vinayaka - వినాయక భజన పాటల లిరిక్స్

P Madhav Kumar

జయ జయ జయ వినాయక జయములీయవా స్వామి
అభయమీయవా.. //2//
గణ గణ గణ గణనాయక గుణమునీయవా, సద్గుణమునీయవా.
గజానన శరణం.. గజముఖ వదనా శరణం//2//

శ్రీ పార్వతి తనయా శిరసాభి వందనం..
హరహర ప్రియ సుతుడా హృదయాభి వందనం.. //2//
ప్రథమ పూజ దురంధరా ప్రణమిల్లెదమయ్యా //2//
పరమ పావనముజేయ పరుగున రావయ్యా... 
//గజానన//
వక్రతుండ మహాకాయ సుమశరమే నీ వరం
ఏకదంత రూపాయ సుమధురమే నీ ద్యాసం //2//
సిద్ధి బుద్ధి విఘ్మేశ్వర భజియించెదమయ్య //2//
స్వరారాగం సుధలందగ శీగ్రమే రావయ్యా. . 
//గజానన//
మహదేవా నీలోకం మాతాపితా సేవితం
మహాబలా నీ మార్గం అనుసరించు ఈ జగం //2//
కాణిపాక గణాధీశ స్మరియించేదమయ్యా. ... //2//
కన్నె మూల గణపతి కదలి రావయ్యా. . 
//గజానన//

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
💬 Chat 📢 Follow