లోకవీరం మహాపూజ్యం సర్వరక్షాకరం విభుమ్ |
పార్వతీ హృదయానందం శాస్తారం ప్రణమామ్యహమ్ || ౧ ||
విప్రపూజ్యం విశ్వవంద్యం విష్ణుశంభోః ప్రియం సుతమ్ |
క్షిప్రప్రసాదనిరతం శాస్తారం ప్రణమామ్యహమ్ || ౨ ||
మత్తమాతంగగమనం కారుణ్యామృతపూరితమ్ |
సర్వవిఘ్నహరం దేవం శాస్తారం ప్రణమామ్యహమ్ || ౩ ||
అస్మత్కులేశ్వరం దేవమస్మచ్ఛత్రువినాశనమ్ |
అస్మదిష్టప్రదాతారం శాస్తారం ప్రణమామ్యహమ్ || ౪ ||
పాండ్యేశవంశతిలకం కేరళే కేళివిగ్రహమ్ |
ఆర్తత్రాణపరం దేవం శాస్తారం ప్రణమామ్యహమ్ || ౫ ||
పంచరత్నాఖ్యమేతద్యో నిత్యం శుద్ధః పఠేన్నరః |
తస్య ప్రసన్నో భగవాన్ శాస్తా వసతి మానసే || ౬ ||
ఇతి శ్రీ శాస్తా పంచరత్నమ్ |
——
అథ శాస్తా నమస్కార శ్లోకాః |
త్రయంబకపురాధీశం గణాధిపసమన్వితమ్ |
గజారూఢమహం వందే శాస్తారం ప్రణమామ్యహమ్ || ౧ ||
శివవీర్యసముద్భూతం శ్రీనివాసతనూద్భవమ్ |
శిఖివాహానుజం వందే శాస్తారం ప్రణమామ్యహమ్ || ౨ ||
యస్య ధన్వంతరిర్మాతా పితా దేవో మహేశ్వరః |
తం శాస్తారమహం వందే మహారోగనివారణమ్ || ౩ ||
భూతనాథ సదానంద సర్వభూతదయాపర |
రక్ష రక్ష మహాబాహో శాస్త్రే తుభ్యం నమో నమః || ౪ ||