Sri Jagannatha Ashtakam – శ్రీ జగన్నాథాష్టకం

 కదాచిత్కాళిందీ తటవిపినసంగీతకవరో

ముదా గోపీనారీవదనకమలాస్వాదమధుపః
రమాశంభుబ్రహ్మాఽమరపతిగణేశాఽర్చితపదో
జగన్నాథస్వామీ నయనపథగామీ భవతు మే || ౧ ||

అర్థం – అప్పుడప్పుడు కాళిందీ నది తీరంలో ఉన్న అడవులలో తన (వేణుగాన) సంగీతమును నింపువాడు, ఆనందంతో వికసించిన గోపికా స్త్రీల ముఖ పద్మములను ఆస్వాదిస్తూ తుమ్మెదవలె విహరించువాడు, రమా, శంభు, బ్రహ్మ, అమరపతి (ఇంద్రుడు) మరియు గణేశునిచే అర్చింపబడు పాదములు కలవాడు అయిన జగములన్నిటికి నాథుడైన జగన్నాథ స్వామీ, నా కనులప్రయాణములందు ఎల్లప్పుడు ఉండుము.

భుజే సవ్యే వేణుం శిరసి శిఖిపింఛం కటితటే
దుకూలం నేత్రాంతే సహచరకటాక్షం విదధతే
సదా శ్రీమద్బృందావనవసతిలీలాపరిచయో
జగన్నాథస్వామీ నయనపథగామీ భవతు మే || ౨ ||

అర్థం – ఎడమచేతిలో వేణువును, శిరస్సున నెమలిపింఛమును, నడుముకు శ్రేష్టమైన వస్త్రములు ధరించి, తన క్రీగంటి చూపులతో తన సహచరులకు కటాక్షమును ఇచ్చువాడు, ఎల్లప్పుడూ శ్రీమంతమైన బృందావనంలో ఉంటూ తన లీలలను చూపువాడు అయిన జగన్నాథ స్వామీ, నా కనులప్రయాణములందు ఎల్లప్పుడు ఉండుము.

మహాంభోధేస్తీరే కనకరుచిరే నీలశిఖరే
వసన్ప్రాసాదాంతః సహజబలభద్రేణ బలినా
సుభద్రామధ్యస్థః సకలసురసేవావసరదో
జగన్నాథస్వామీ నయనపథగామీ భవతు మే || ౩ ||

అర్థం – మహాసాగరము యొక్క తీరమందు ఉన్న బంగారు వర్ణం కలిగిన ఇసుక రేణువుల వద్ద ఉన్న నీలాచల శిఖరమందు ఉన్న రాజభవనంలో, అనుజుడైన, బలశాలి అయిన బలభద్రునితో కలిసి, తమ మధ్య సుభద్రతో కూడి, సకల దేవతలు సేవించే అవకాశం కోసం ఎదురుచూస్తూ ఉన్న జగన్నాథ స్వామీ, నా కనులప్రయాణములందు ఎల్లప్పుడు ఉండుము.

కృపాపారావారః సజలజలదశ్రేణిరుచిరో
రమావాణీసోమస్ఫురదమలపద్మోద్భవముఖైః
సురేంద్రైరారాధ్యః శ్రుతిగణశిఖాగీతచరితో
జగన్నాథస్వామీ నయనపథగామీ భవతు మే || ౪ ||

అర్థం – కరుణ సముద్రమంత కలిగి, జలము నిండుగా ఉన్న నల్లమబ్బుల వంటి శోభ కలిగినవాడు, రమ (లక్ష్మీదేవి), వాణీ (సరస్వతీదేవి) లకు ఆనందము కలిగించువాడు, సురేంద్రునిచే ఆరాధింపబడువాడు, శృతులయందు (వేదములు) ఉన్న ఉన్నత గీతలచే (వాక్యబోధలు) కీర్తింపదగ్గ చరితము కలవాడు అయిన జగన్నాథ స్వామీ, నా కనులప్రయాణములందు ఎల్లప్పుడు ఉండుము.

రథారూఢో గచ్ఛన్పథి మిళితభూదేవపటలైః
స్తుతిప్రాదుర్భావం ప్రతిపదముపాకర్ణ్య సదయః
దయాసింధుర్బంధుః సకలజగతాం సింధుసుతయా
జగన్నాథస్వామీ నయనపథగామీ భవతు మే || ౫ ||

అర్థం – రథమును ఎక్కి తిరుగుతూ, రహదారులలో కలిసిపోయి వ్యక్తమవుతున్న స్తుతులను అడుగడుగునా అప్పటికప్పుడు వింటూ, సాగరమంత దయ కలిగి, సకల జగత్తులయందు బంధువువలె, సముద్రముయొక్క పుత్రునివలె ఉన్న జగన్నాథ స్వామీ, నా కనులప్రయాణములందు ఎల్లప్పుడు ఉండుము.

పరబ్రహ్మాపీడః కువలయదళోత్ఫుల్లనయనో
నివాసీ నీలాద్రౌ నిహితచరణోఽనంతశిరసి
రసానందో రాధాసరసవపురాలింగనసుఖో
జగన్నాథస్వామీ నయనపథగామీ భవతు మే || ౬ ||

అర్థం – కుంచించిన  పరబ్రహ్మ స్వరూపముతో, నీలికమల దళములవంటి వికసించిన నయనములు కలిగి, నీలాద్రి (నీలాచల) నివాసి, అనంతుడి శిరస్సుపై ఉంచిన పాదములతో, రసానందభరితురాలైన రాధ యొక్క అందమైన శరీరముచే ఆనందముగా కౌగిలించుకొనబడి ఉన్న జగన్నాథ స్వామీ, నా కనులప్రయాణములందు ఎల్లప్పుడు ఉండుము.

న వై ప్రార్థ్యం రాజ్యం న చ కనకతాం భోగవిభవం
న యాచేఽహం రమ్యాం నిఖిలజనకామ్యాం వరవధూమ్
సదా కాలే కాలే ప్రమథపతినా గీతచరితో
జగన్నాథస్వామీ నయనపథగామీ భవతు మే || ౭ ||

అర్థం – రాజ్యములను, బంగారము మరియు రత్నముల వంటి సంపదను యాచించను. అందరిచే వాంఛింపబడు అందమైన స్త్రీని అడుగను. అన్నికాలముల యందు ప్రమథపతి (శివుడు) చే కీర్తింపబడు చరితము కలిగిన జగన్నాథ స్వామీ, నా కనులప్రయాణములందు ఎల్లప్పుడు ఉండుము.

హర త్వం సంసారం ద్రుతతరమసారం సురపతే
హర త్వం పాపానాం వితతిమపరాం యాదవపతే
అహో దీనానాథం నిహితమచలం నిశ్చితపదం
జగన్నాథస్వామీ నయనపథగామీ భవతు మే || ౮ ||

అర్థం – ఉపయోగం లేని ఈ భౌతికమైన సంసారమును నీవు త్వరగా హరింపుము ఓ సురపతీ. అపరిమితముగా వ్యాపించిన నా పాపములను తొలగింపుము ఓ యాదవపతీ. ఆహా, దీనులకు, అనాథులకు నీ ఈ చరణములు స్పష్టమైన నివాసము. (కనుక ఓ) జగన్నాథ స్వామీ, నా కనులప్రయాణములందు ఎల్లప్పుడు ఉండుము.

జగన్నాథాష్టకం పుణ్యం యః పఠేత్ప్రయతః శుచి |
సర్వపాపవిశుద్ధాత్మా విష్ణులోకం స గచ్ఛతి ||

అర్థం – జగన్నాథాష్టకం అను పుణ్యవంతమైన దీనిని భక్తిగా శుచిగా పఠించువారు పాపములు తొలగింపబడిన శుద్ధమైన ఆత్మను కలిగి విష్ణులోకమునకు వెళ్ళెదరు.

ఇతి శ్రీ జగన్నాథాష్టకమ్ ||

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!