మూడురకాల ఆచమన పద్ధతులు - ఆచమనమ్ (ఆచమ్య) - Achamanam Mantra in Telugu

P Madhav Kumar

 మూడురకాల ఆచమన పద్ధతులు ఉన్నయి – శ్రౌతాచమనము, స్మృత్యాచమనము, పురాణాచమనము. వాటి మంత్రాలు ఈ క్రింద ఇవ్వడం జరిగింది. కుడి చేతిని గోకర్ణాకృతిలో పెట్టి, మొదటి మూడు నామాలకు ఎడమ చేతితో పంచపాత్రలో నీళ్ళను ఉద్ధరిణతో తీసుకుని కుడి అరచేతిలో పోసుకుని శబ్దం రాకుండా త్రాగాలి. నాలుగవ నామానికి నీళ్ళు విడిచిపెట్టి, తర్వాతి నామాలకు నమస్కారం చేయాలి. సాంప్రదాయాన్ని బట్టి మిగిలిన నామాలకు శరీర అంగములను స్పృశించవచ్చు.

స్మృత్యాచమనం –
హస్తా॑వవ॒నిజ్య॒ (రెండు అరచేతులు నీళ్ళతో తుడుచుకోండి)
త్రిరాచా॑మే॒త్ (మూడు మార్లు ఆచమనము చేయండి)
ద్విః ప॑రి॒మృజ్య॑ (ఎడమ అరచేతిలో నీరు తీసుకుని కుడి అంగుష్ఠతో పై పెదవి, క్రింది పెదవి వేర్వేరుగా)
స॒కృదు॑ప॒స్పృశ్య॑ (కుడి అంగుష్ఠతో రెండు పెదవులు కలిపి)
యత్స॒వ్యం పా॒ణిం (ఎడమ అరచేయి)
పా॒దౌ ప్రో॒క్షతి॒ (ఎడమ, కుడి పాదములు)
శిర॑: (శిరస్సు మీద ప్రోక్షణ చేసుకోండి)
చక్షు॑షీ॒ (అంగుష్ఠ-అనామికలతో ఎడమ కన్ను, కుడి కన్ను)
నాసి॑కే॒ (అంగుష్ఠ-తర్జనులతో ఎడమ ముక్కు, కుడి ముక్కు)
శ్రోత్రే॒ (అంగుష్ఠ-మధ్యమలతో ఎడమ చెవి, కుడి చెవి)
హృద॑యమా॒లభ్య॑ || (అరచేతితో వక్షఃస్థలము)

శ్రౌతాచమనము –
౧. ఓం తత్స॑వి॒తుర్వరే”ణ్య॒గ్గ్॒ స్వాహా” | (జలప్రాశనము)
౨. భర్గో॑ దే॒వస్య॑ ధీమహి॒ స్వాహా” | (జలప్రాశనము)
౩. ధియో॒ యో న॑: ప్రచో॒దయా॒త్ స్వాహా” | (జలప్రాశనము)
౪. ఆపో॒ హిష్ఠా మ॑యో॒భువ॑: | (ఉదకముతో రెండు అరచేతులు)
౫. తా న॑ ఊ॒ర్జే ద॑ధాతన | (ఉదకముతో రెండు అరచేతులు)
౬. మ॒హేరణా॑య॒ చక్ష॑సే | (కుడి అంగుష్ఠతో పై పెదవి)
౭. యో వ॑శ్శి॒వత॑మో॒ రస॑: | (కుడి అంగుష్ఠతో క్రింది పెదవి)
౮. తస్య॑ భాజయతే॒ హ న॑: | (శిరస్సుపై ప్రోక్షణ)
౯. ఉ॒శ॒తీరి॑వ మా॒తర॑: | (శిరస్సుపై ప్రోక్షణ)
౧౦. తస్మా॒ అర॑ఙ్గమామ వః | (ఎడమ అరచేయి)
౧౧. యస్య॒ క్షయా॑య॒ జిన్వ॑థ | (రెండు పాదములు)
౧౨. ఆపో॑ జ॒నయ॑థా చ నః | (శిరస్సు)
౧౩. ఓం భూః | (అన్ని కుడిచేతివ్రేళ్ళతో గడ్డము)
౧౪. ఓం భువ॑: | (అంగుష్ఠ-తర్జనులతో ఎడమ ముక్కు)
౧౫. ఓగ్‍ం సువ॑: | (అంగుష్ఠ-తర్జనులతో కుడి ముక్కు)
౧౬. ఓం మహ॑: | (అంగుష్ఠ-అనామికలతో ఎడమ కన్ను)
౧౭. ఓం జన॑: | (అంగుష్ఠ-అనామికలతో కుడి కన్ను)
౧౮. ఓం తప॑: | (అంగుష్ఠ-అనామికలతో ఎడమ చెవి)
౧౯. ఓగ్‍ం స॒త్యమ్ | (అంగుష్ఠ-అనామికలతో కుడి చెవి)
౨౦. ఓం తత్స॑వి॒తుర్వరే”ణ్య॒మ్ | (అంగుష్ఠ-కనిష్ఠికలతో నాభి)
౨౧. భర్గో॑ దే॒వస్య॑ ధీమహి॒ | (హృదయము)
౨౨. ధియో॒ యో న॑: ప్రచో॒దయా”త్ | (అన్ని కుడిచేతివ్రేళ్ళతో శిరస్సు)
౨౩. ఓమాపో॒ జ్యోతీ॒ రసో॒ఽమృత॒o బ్రహ్మ॒ | (అన్ని కుడిచేతివ్రేళ్ళతో ఎడమ భుజము)
౨౪. భూర్భువ॒స్సువ॒రోమ్ | (అన్ని కుడిచేతివ్రేళ్ళతో కుడి భుజము)

పురాణాచమనము –
౧. ఓం కేశవాయ స్వాహా | (జలప్రాశనము)
౨. ఓం నారాయణాయ స్వాహా | (జలప్రాశనము)
౩. ఓం మాధవాయ స్వాహా | (జలప్రాశనము)
౪. ఓం గోవిందాయ నమః | (కుడి అరచేయి)
౫. ఓం విష్ణవే నమః | (ఎడమ అరచేయి)
౬. ఓం మధుసూదనాయ నమః | (అంగుష్ఠతో పై పెదవి)
౭. ఓం త్రివిక్రమాయ నమః | (అంగుష్ఠతో క్రింది పెదవి)
౮. ఓం వామనాయ నమః | (శిరస్సుపై ప్రోక్షణ)
౯. ఓం శ్రీధరాయ నమః | (శిరస్సుపై ప్రోక్షణ)
౧౦. ఓం హృషీకేశాయ నమః | (ఎడమ అరచేయి)
౧౧. ఓం పద్మనాభాయ నమః | (రెండు పాదములు)
౧౨. ఓం దామోదరాయ నమః | (బ్రహ్మరంధ్రము)
౧౩. ఓం సంకర్షణాయ నమః | (అన్ని కుడిచేతివ్రేళ్ళతో గడ్డము)
౧౪. ఓం వాసుదేవాయ నమః | (అంగుష్ఠ-తర్జనులతో ఎడమ ముక్కు)
౧౫. ఓం ప్రద్యుమ్నాయ నమః | (అంగుష్ఠ-తర్జనులతో కుడి ముక్కు)
౧౬. ఓం అనిరుద్ధాయ నమః | (అంగుష్ఠ-అనామికలతో ఎడమ కన్ను)
౧౭. ఓం పురుషోత్తమాయ నమః | (అంగుష్ఠ-అనామికలతో కుడి కన్ను)
౧౮. ఓం అధోక్షజాయ నమః | (అంగుష్ఠ-అనామికలతో కుడి చెవి)
౧౯. ఓం నారసింహాయ నమః | (అంగుష్ఠ-అనామికలతో ఎడమ చెవి)
౨౦. ఓం అచ్యుతాయ నమః | (అంగుష్ఠ-కనిష్ఠికలతో నాభి)
౨౧. ఓం జనార్దనాయ నమః | (అరచేతితో హృదయము)
౨౨. ఓం ఉపేంద్రాయ నమః | (మూర్ధ్ని)
౨౩. ఓం హరయే నమః | (ఎడమ భుజమూలం)
౨౪. ఓం శ్రీకృష్ణాయ నమః | (కుడి భుజమూలం)

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat