౧. షిర్డీ ప్రవేశమే సర్వదుఃఖ పరిహారము.
౨. అర్హులైననేమి నిరుపేదలైననేమి ద్వారకామాయి ప్రవేశ మొనరించినంతనే సుఖసంపదలు పొందగలరు.
౩. ఈ భౌతిక దేహానంతరము నేనప్రమత్తుడను.
౪. నా భక్తులకు రక్షణంబు నా సమాధినుండియే వెలువడుచుండును.
౫. నా సమాధినుండియే నా మనుష్య శరీరము మాట్లాడును.
౬. నన్నాశ్రయించిన వారిని శరణుజొచ్చిన వారిని రక్షించుటయే నా కర్తవ్యము.
౭. నాయందెవరికి దృష్టియో వారి యందే నా కటాక్షము.
౮. మీ భారములను నాపై బడవేయుడు, నేను మోసెదను.
౯. నా సహాయము గాని, నా సలహాను గాని కోరిన తక్షణమొసంగ సంసిద్ధుడను.
౧౦. నా భక్తుల యింట లేమి యను శబ్దమే పొడచూపదు.
౧౧. నా సమాధి నుండియే నేను సర్వకార్యములను నిర్వహింతును.