Read in: తెలుగు | ಕನ್ನಡ | தமிழ் | देवनागरी | English | മലയാളം | ગુજરાતી | मराठी |

ఇంత తొందరెందుకయ్యా కన్నె స్వామి

 ఇంత తొందరెందుకయ్యా కన్నె స్వామి! కాలు నేల మీద నిలువదాయె కన్నె స్వామి!!


1 శరణుఘోష మరచి పోకు కన్నె స్వామి నువు గురుస్వామిని వదలబోకు కన్నె స్వామి!!


2 ఎరుమేలి పేట లోన కన్నె స్వామి నువ్వు వేటతుళ్లి ఆడవయ్యా కన్నె స్వామి!!


3 నువ్వు అడుగువేస్తే చాలునయ్యా కన్నె స్వామి రాల్లు ముల్లు పూలౌతాయి కన్నె స్వామి!!


4 పాపాలన్నీ మూటగట్టి కన్నె స్వామి నువు పంబలోన వదలిపెట్టు కన్నె స్వామి!!||ఇంత॥


5 పదునెనిమిది మెట్లను ఎక్కి కన్నె స్వామి నువు పరవశించి పోతావు కన్నె స్వామి!!


చ6॥ నెయ్యాభిషేకం కన్నె స్వామి నువు కనులారా చూస్తావు కన్నె స్వామి!!


మకర సంక్రాంతి నాడు కన్నెస్వామి నువు మకర జ్యోతి చూస్తావు కన్నె స్వామి!!


భక్తితో నీ మనసు కన్నె స్వామి ఇక ఉయ్యాల లూగెనయ్యా కన్నె స్వామి ||

📢 Follow