ఓం రామానుజాయ నమః |
ఓం పుష్కరాక్షాయ నమః |
ఓం యతీంద్రాయ నమః |
ఓం కరుణాకరాయ నమః |
ఓం కాంతిమత్యాత్మజాయ నమః |
ఓం శ్రీమతే నమః |
ఓం లీలామానుషవిగ్రహాయ నమః |
ఓం సర్వశాస్త్రార్థతత్త్వజ్ఞాయ నమః |
ఓం సర్వజ్ఞాయ నమః | ౯
ఓం సజ్జనప్రియాయ నమః |
ఓం నారాయణకృపాపాత్రాయ నమః |
ఓం శ్రీభూతపురనాయకాయ నమః |
ఓం అనఘాయ నమః |
ఓం భక్తమందారాయ నమః |
ఓం కేశవానందవర్ధనాయ నమః |
ఓం కాంచీపూర్ణప్రియసఖాయ నమః |
ఓం ప్రణతార్తివినాశకాయ నమః |
ఓం పుణ్యసంకీర్తనాయ నమః | ౧౮
ఓం పుణ్యాయ నమః |
ఓం బ్రహ్మరాక్షసమోచకాయ నమః |
ఓం యాదవాపాదితాపార్థవృక్షచ్ఛేదకుఠారకాయ నమః |
ఓం అమోఘాయ నమః |
ఓం లక్ష్మణమునయే నమః |
ఓం శారదాశోకనాశకాయ నమః |
ఓం నిరంతరజనాజ్ఞాననిర్మోచనవిచక్షణాయ నమః |
ఓం వేదాంతద్వయసారజ్ఞాయ నమః |
ఓం వరదాంబుప్రదాయకాయ నమః | ౨౭
ఓం వరదాభిప్రాయతత్త్వజ్ఞాయ నమః |
ఓం యామునాంగులిమోచకాయ నమః |
ఓం దేవరాజకృపాలబ్ధషడ్వాక్యార్థమహోదధయే నమః |
ఓం పూర్ణార్యలబ్ధసన్మంత్రాయ నమః |
ఓం శౌరిపాదాబ్జషట్పదాయ నమః |
ఓం ఫణాపృష్ఠలసద్విష్ణుపాదాంకసమపుండ్రవతే నమః |
ఓం త్రిదండధారిణే నమః |
ఓం బ్రహ్మజ్ఞాయ నమః |
ఓం బ్రహ్మజ్ఞానపరాయణాయ నమః | ౩౬
ఓం రంగేశకైంకర్యరతాయ నమః |
ఓం విభూతిద్వయనాయకాయ నమః |
ఓం గోష్ఠీపూర్ణకృపాలబ్ధమంత్రరాజప్రకాశకాయ నమః |
ఓం వరరంగానుకంపాత్తద్రావిడామ్నాయపారగాయ నమః |
ఓం మాలాధరార్యసుజ్ఞాతద్రావిడామ్నాయతత్త్వధియే నమః |
ఓం చతుస్సప్తతిశిష్యాడ్యాయ నమః |
ఓం పంచాచార్యపదాశ్రయాయ నమః |
ఓం ప్రపీతవిషతీర్థాంభఃప్రకటీకృతవైభవాయ నమః |
ఓం ప్రపన్నజనకూటస్థాయ నమః | ౪౫
ఓం గోవిందార్యద్విజానుజాయ నమః |
ఓం ప్రణతార్తిహరాచార్యదత్తభిక్షైకభోజనాయ నమః |
ఓం పవిత్రీకృతకూరేశాయ నమః |
ఓం భాగినేయత్రిదండకాయ నమః |
ఓం కూరేశదాశరథ్యాదిచరమార్థప్రకాశకాయ నమః |
ఓం రంగేశవేంకటేశాదిప్రకటీకృతవైభవాయ నమః |
ఓం దేవరాజార్చనరతాయ నమః |
ఓం మూకముక్తిప్రదాయకాయ నమః |
ఓం యజ్ఞమూర్తిప్రతిష్ఠాత్రే నమః | ౫౪
ఓం మంత్రదాయ నమః |
ఓం ధరణీధరాయ నమః |
ఓం వరదాచార్యసద్భక్తాయ నమః |
ఓం యజ్ఞేశార్తివినాశకాయ నమః |
ఓం అనంతాభీష్టఫలదాయ నమః |
ఓం విఠలేంద్రప్రపూజితాయ నమః |
ఓం శ్రీశైలపూర్ణకరుణాలబ్ధరామాయణార్థకాయ నమః |
ఓం వ్యాససూత్రార్థతత్త్వజ్ఞాయ నమః |
ఓం బోధాయనమతానుగాయ నమః | ౬౩
ఓం శ్రీభాష్యాదిమహాగ్రంథకారకాయ నమః |
ఓం కలినాశకాయ నమః |
ఓం అద్వైతమతవిచ్ఛేత్రే నమః |
ఓం విశిష్టాద్వైతపారగాయ నమః |
ఓం కురంగనగరీపూర్ణమంత్రరత్నోపదేశకాయ నమః |
ఓం వినాశితాఖిలమతాయ నమః |
ఓం శేషీకృతరమాపతయే నమః |
ఓం పుత్రీకృతశఠారాతయే నమః |
ఓం శఠజిదృణమోచకాయ నమః | ౭౨
ఓం భాషాదత్తహయగ్రీవాయ నమః |
ఓం భాష్యకారాయ నమః |
ఓం మహాయశసే నమః |
ఓం పవిత్రీకృతభూభాగాయ నమః |
ఓం కూర్మనాథప్రకాశకాయ నమః |
ఓం శ్రీవేంకటాచలాధీశశంఖచక్రప్రదాయకాయ నమః |
ఓం శ్రీవేంకటేశశ్వశురాయ నమః |
ఓం శ్రీరమాసఖదేశికాయ నమః |
ఓం కృపామాత్రప్రసన్నార్యాయ నమః | ౮౧
ఓం గోపికామోక్షదాయకాయ నమః |
ఓం సమీచీనార్యసచ్ఛిష్యసత్కృతాయ నమః |
ఓం వైష్ణవప్రియాయ నమః |
ఓం కృమికంఠనృపధ్వంసినే నమః |
ఓం సర్వమంత్రమహోదధయే నమః |
ఓం అంగీకృతాంధ్రపూర్ణాయ నమః |
ఓం సాలగ్రామప్రతిష్ఠితాయ నమః |
ఓం శ్రీభక్తగ్రామపూర్ణేశాయ నమః |
ఓం విష్ణువర్ధనరక్షకాయ నమః | ౯౦
ఓం బౌద్ధధ్వాంతసహస్రాంశవే నమః |
ఓం శేషరూపప్రదర్శకాయ నమః |
ఓం నగరీకృతవేదాద్రయే నమః |
ఓం డిల్లీశ్వరసమర్చితాయ నమః |
ఓం నారాయణప్రతిష్ఠాత్రే నమః |
ఓం సంపత్పుత్రవిమోచకాయ నమః |
ఓం సంపత్కుమారజనకాయ నమః |
ఓం సాధులోకశిఖామణయే నమః |
ఓం సుప్రతిష్ఠితగోవిందరాజాయ నమః | ౯౯
ఓం పూర్ణమనోరథాయ నమః |
ఓం గోదాగ్రజాయ నమః |
ఓం దిగ్విజేత్రే నమః |
ఓం గోదాభీష్టప్రపూరకాయ నమః |
ఓం సర్వసంశయవిచ్ఛేత్రే నమః |
ఓం విష్ణులోకప్రదాయకాయ నమః |
ఓం అవ్యాహతమహద్వర్త్మనే నమః |
ఓం యతిరాజాయ నమః |
ఓం జగద్గురవే నమః | ౧౦౮
ఇతి రామానుజాష్టోత్తరశతనామావళిః |