బ్రమరాంబాదేవి బ్రమరాంబాదేవి మ్మ మల్లన్న దేవుడు పేదోడమ్మ ఏమి కొరకు తల్లి
పడలెత్తిన నాగుల మెడలో నగలు చేసుకుంటడే ||
రుద్రాక్షలు ఒదిగి ఉన్న మాలాలేసుకుంటాడే ||
వజ్రవైడూర్యాలు కావాలని వేదించబోకే మాదేవేరీ
(బ్రమారాంభ)
జంజేమున్న జంగమోడు బుడిద పూసుకుంటాడే||
సేతులమీద నుదుటికంత విభూతి రాసుకుంటడే||
అత్తరు పన్నీరు కావాలని అలుగబోకే అమ్మోరు తల్లి"""
(బ్రమరాంబాదేవి)
నార పూసలు నడుముకుతప్ప దిగంబరుడు సుడవే||
డమరుకం యోగదండం త్రిశూలాలే ఆస్తులే||
బంగారు సొమ్ములు కావాలని బాధపెట్టకే బంగారుతల్లి
(బ్రమరాంబాదేవి)
సల్లని ఎన్నెల సక్కని గంగను సిగల దాసుకుంటాడే||
దోళాతనం తప్ప ఏమీ ఎరుగడు పరమేషుడే||
ల్లిగవ్వ చేతిలోలేకున్న ఏళ్లలోకాలను ఏలుతున్నోడే ....
(బ్రమరాంబాదేవి)