పాడితే శ్రీ రాముని పాట పాడాలి
భక్తితో శ్రీ రాముని భజన చేయాలి || 2 ||
పూలతో శ్రీ రాముని పూజ చేయాలి
ప్రతి నిత్యము శ్రీ రాముని సేవ చేయాలి
పాడితే శ్రీ రాముని పాట పాడాలి
భక్తితో శ్రీ రాముని భజన చేయాలి
చరణం 1 :-
మల్లెలు మొల్లలు కోసుకొద్దాము
సన్నజాజి పువ్వులు తీసుకొద్దాము
పున్నాగ పువ్వులు ఏరుకొద్దాము
మందార పూలతో మాల కడదాము
పాడితే శ్రీ రాముని పాట పాడాలి
భక్తితో శ్రీ రాముని భజన చేయాలి
చరణం 2 :-
రారండి శ్రీ రాముని చూచివద్దాము
శ్రీ రాముని మెడలోన మాలవేద్దాము
మనసారా శ్రీరాముని మ్రొక్కివడ్డాము
శ్రీ రాముని ఆశీస్సులు పొంది వద్దాము
పాడితే శ్రీ రాముని పాట పాడాలి
భక్తితో శ్రీ రాముని భజన చేయాలి
పూలతో శ్రీ రాముని పూజ చేయాలి
ప్రతి రోజు శ్రీ రాముని సేవ చేయాలి || 2 ||