Read in: తెలుగు | ಕನ್ನಡ | தமிழ் | देवनागरी | English | മലയാളം | ગુજરાતી | मराठी |

ఆశీర్వదించు రామా మమ్ము ఆశీర్వదించు - శ్రీరామ భజన పాటల లిరిక్స్

 ఆశీర్వదించు రామా

మమ్ము ఆశీర్వదించు రామా || 2 ||

నీ పాద పద్మాలపై
భక్తితో ప్రణమిల్లినామా రామా || 2 ||

అభయప్రదాత రామా
మా తండ్రి ఐశ్వర్య దాతా రామా

ఆరోగ్య దాత రామా
మా తండ్రి ఆనంద దాత రామా

అసమాన రూప రామా
మా తండ్రి రవితేజ రూప రామా

సౌదర్యం మూర్తి రామా
మా తండ్రి సద్గుణా మూర్తి రామా

అయోధ్య వాసా రామా
మా తండ్రి అసమాన మూర్తి రామా

కరుణ కటాక్ష రామా
మా తండ్రి భక్త సంరక్ష రామా

కృష్ణావతార రామా
మా తండ్రి అవతారపురుష రామా

ఓ పుండరీక్ష రామా
మా తండ్రి మమ్ము కాపాడు రామా

📢 Follow