పల్లవి:-
దాగుడు మూతలు ఊలలాటలో దాగినాడు
నా రాముడు, ఎక్కడ దాగాడే
నా కంటికి కనపడడే
అతనిని చూడాలి
మనము ఆటల్లో గెలవాలి
చరణం 1
గలగల పాడే ఓ సెలఏరా...
కిలకిలా లాడే పక్షుల్లారా...
రాముణ్ణి చూసారా...
మా దేవుణ్ణి చూసారా || 2||
పల్లవి:-
దాగుడు మూతలు ఊలలాటలో దాగినాడు
నా రాముడు, ఎక్కడ దాగాడే
నా కంటికి కనపడడే
అతనిని చూడాలి
మనము ఆటల్లో గెలవాలి
చరణం 2
నిగనిగ లాడే హంసల్లారా
కలకల లాడే వృక్షముల్లారా
రాముణ్ణి చూసారా
మా దేవుణ్ణి చూసారా
ఎక్కడ ఉన్నాడా
మీ ఇంటనే డాగాడా || 2||
పల్లవి:-
దాగుడు మూతలు ఊలలాటలో దాగినాడు
నా రాముడు, ఎక్కడ దాగాడే
నా కంటికి కనపడడే
అతనిని చూడాలి
మనము ఆటల్లో గెలవాలి
చరణం 3
కొండల్లారా కోనల్లారా
రివున్న ఎగసే గువ్వల్లారా
రాముణ్ణి చూసారా
మా దేవుణ్ణి చూసారా
అక్కడ ఉన్నాడా
మీ ఇంటనే దాగాడా || 2||
పల్లవి:-
దాగుడు మూతలు ఊలలాటలో దాగినాడు
నా రాముడు, ఎక్కడ దాగాడే
నా కంటికి కనపడడే
అతనిని చూడాలి
మనము ఆటల్లో గెలవాలి
చరణం 4
తళ తళ మెరిసే తారకల్లారా
వెన్నెల కురిసే ఓ చందమామా
రామున్ని చూసారా
మా దేవుణ్ణి చూసారా
అక్కడ ఉన్నాడా
మీ ఇంటనే దాగాడా || 2||
పల్లవి:-
దాగుడు మూతలు ఊలలాటలో దాగినాడు
నా రాముడు, ఎక్కడ దాగాడే
నా కంటికి కనపడడే
అతనిని చూడాలి
మనము ఆటల్లో గెలవాలి
చరణం 5
చల్లగా వీచే ఓ చిరుగాలి
మెల్లగా సాగే ఓ మేఘమాల
రామున్ని చూసారా
మా దేవుణ్ణి చూసారా
అక్కడ ఉన్నాడా
మీ ఇంటనే దాగాడా || 2||
పల్లవి:-
దాగుడు మూతలు ఊలలాటలో దాగినాడు
నా రాముడు, ఎక్కడ దాగాడే
నా కంటికి కనపడడే
అతనిని చూడాలి
మనము ఆటల్లో గెలవాలి.