ఎంత మధురమో రామనామము ఎంతెంత మధురమో - శ్రీరామ భజన పాటల లిరిక్స్

P Madhav Kumar

 ఎంత మధురమో రామనామము

ఎంతెంత మధురమో రామనామము
రామ రామ సీత

చరణం 1 :

పాలు తేనెలకన్న పంచదారాలకన్న
తీయగుంటాది రామనామము
తీయతీయగుంటది రామనామము

రామ రామ సీత
ఎంత మధురమో రామ నామము
ఎంతెంత మధురమో రామ నామము

చరణం 2 :

పండు వెన్నెలకన్న
నిండు జాబిలికన్న
చల్లగుంటదీ రామ నామము
చల్లచల్లగుంటది రామ నామము

రామ రామ సీత
ఎంత మధురమో రామ నామము
ఎంతెంత మధురమో రామ నామము

చరణం 3 :

చిలక పలుకులుకన్న
కోయిలరాగాలకన్న
హాయిగుంటాది రామనామము
హాయి హాయిగుంటది రామ నామము

రామ రామ సీత
ఎంత మధురమో రామ నామము
ఎంతెంత మధురమో రామనామము
మదురాతి మదురము రామనామము
రామ రామ సీత || 2 ||

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat