Vinakaya chavithi : వినాయక చవితి విగ్రహ ప్రతిష్టాపన నియమాలు ఇవే

P Madhav Kumar

 


ఎలాంటి విగ్రహం తీసుకోవాలి?

మొదటి సారి మీరు వినాయక చవితి రోజు వినాయకుడి విగ్రహాన్ని ప్రతిష్టించుకోవాలని అనుకుంటున్నారా? అయితే ఎలాంటి విగ్రహం ఇంటికి తీసుకొస్తే బాగుంటుందో తెలుసుకోవాలి. గణేష్ విగ్రహాన్ని ఎన్నుకునేటప్పుడు తొండం ఎడమ వైపు వంగి ఉన్న దాన్ని ఎంచుకోవడం చాలా శుభంగా పరిగణిస్తారు. అలాగే కూర్చుని ఉన్న గణేష్ విగ్రహం కొనుగోలు చేయండి. ఇది ఆనందం, శ్రేయస్సును సూచిస్తుంది. అలాగే గణేషుడి భంగిమలో ఒక చేతిలో మోదక్, రెండో చేత్తో ఆశీర్వాదం ఇస్తున్నట్టుగా ఉంటే మంచిది.

ఇంటి ఈశాన్య దిశలో గణేష్ విగ్రహాన్ని ప్రతిష్టించవచ్చు. విగ్రహం ఉత్తరం వైపు ఎదురుగా ఉండాలి. శుభ్రమైన వేదిక వేసి దాని మీద ప్రతిష్టించాలి. ఈ దిశలో విగ్రహాన్ని పెట్టడం వల్ల ఇంటికి సానుకూల శక్తి, ఆశీర్వాదాలు లభిస్తాయి. అలాగే ఎప్పుడు ఒకటి కంటే ఎక్కువ వినాయకుడి విగ్రహాలు ఇంట్లో ఉండకూడదు. అది మాత్రమే కాదు వినాయకుడి విగ్రహాన్ని ఒంటరిగా ఉంచకూడదు. లక్ష్మీదేవి విగ్రహాన్ని కూడా పక్కన ఏర్పాటు చేయాలి.

ఏ రంగు మంచిది?

విగ్రహం ఎరుపు లేదా కుంకుమ రంగులో ఉన్నది ఇంటికి తీసుకురావడం మంచిది. ఇది ఆత్మవిశ్వాసం పెంచుతుంది, జీవితంలో ఏవైనా అడ్డంకులు లేదా సమస్యలు ఉంటే తొలగిస్తుందని నమ్ముతారు. మీరు తెలుపు రంగు వినాయకుడి విగ్రహాన్ని తీసుకురావచ్చు. ఇది ఇంటికి ఆనందం, శాంతిని అందిస్తుంది.

గంగాజలంతో శుద్ది చేసిన తర్వాత పూజలు చేయాలి. మూడు, ఐదు, ఏడు లేదా తొమ్మిది రోజుల పాటు విగ్రహాన్ని ఉంచుకోవచ్చు. ఉదయం, సాయంత్రం దీపం వెలిగించి పూజలు చేయాలి. పండ్లు, పూలతో అలంకరించాలి. నైవేద్యం సమర్పించాలి.


#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat