సాకి...
అహోబిలం మహాబలం
శ్రీ నరసింహుని దివ్యదర్శనము
మహావరం మహావరం మహావరం
పల్లవి...
అహోబిల నరసింహ మా స్వామి నరసింహా
మా అండ నీవుండ రావయ్య జయసింహా...
రావయ్య జయసింహా. !! అహో !!
నిను నమ్మువారికి తొలగు భయములు
నిను కీర్తించిన కలుగు జయములు - 2
దశావతార హే నారాయణ
దర్శన మీయవయ్యా లక్ష్మీ నరసింహా. !! అహో !!
సర్వము నీవే శ్రీ నరసింహా
సాదుపోషక జయ నరసింహా
జగతిలో నీవు మము కరుణించగ
ఆహోబిలంబున వెలసిన దేవా. !! అహో!!