Read in: తెలుగు | ಕನ್ನಡ | தமிழ் | देवनागरी | English | മലയാളം | ગુજરાતી | मराठी |

మహాదేవ శంభో మము కావరావా - శివ భజన పాటల లిరిక్స్

 

సాకి...
శంభో.....హరహర మహాదేవ శంభో....

పల్లవి:
మహాదేవ శంభో మము కావరావా
కరుణామృతా హృదయా కైలాసవాసా ఉమా
మహేశా కరుణించి కాపాడవా హరహర
కరుణించి కాపాడవా. 

!! మహా !!


కనులకు ఒకసారి కనుపించరావా
మనసార నిన్నే కొలిచేము స్వామి
కారుమబ్బులు కమ్మెను జగతిని
జ్యోతిని వెలిగించరా హరహర
మాలో చీకటి తొలగించవా. 

!! మహా !!


శ్రీశైలవాసా శ్రిత పారిజాతా
శతకోటి లింగేశ్వరా హరహర
ఓంకార నాదాయ ప్రణవ స్వరూపాయ
ఆనంద లింగేశ్వరా హరహర
ఆనంద లింగేశ్వరా. 

!! మహా !!


ఈ పాటను ఎలా పాడాలో చూడండి.




📢 Follow