కరుణ చూపుమా మాపైన శ్రీ వేంకటేశా - వేంకటేశ భజన పాటల లిరిక్స్

P Madhav Kumar

 

కరుణ చూపుమా మాపైన శ్రీ వేంకటేశా
శరణమో శ్రీ శ్రీనివాసా వైకుంఠ వాసా
సదా నిను మది వేడితి దేవా
పదే పదే నిను పిలువగ రావా   || కరుణ ||

చరణం 1: 

నింగిని తాకిన ఆ కొండలపై బంగరు గుడిలో వెలిసావు
నీరజ లోచన శిలరూపుడవై కవియుగ దేవుడ వైనావు
నీవే దిక్కని నమ్మిన వారికి ఇలవేల్పుడవై కాపాడెదవు  || కరుణ ||

చరణం 2: 

ఏడు కొండలను ఎక్కుతు స్వామి నీ సన్నిధికి చేరాము
ముడుపులు తెచ్చి మ్రొక్కులు తీర్చగ నీ వాకిటను నిలిచాము
మా గోడును వినవా స్వామి నీ మోమును చూపవదేమి   || కరుణ ||

చరణం 3: 

గోవిందా హరి గోవిందాయని నీ నామ స్మరణముతో
గిరులు ఝరులు మారు మ్రోగగా భక్త కోటి నిను చేరెదరు
గరుడ వాహనా కానగ రావా దీన జనులను కావగలేవా  || కరుణ ||

చరణం 4: 

ఆపద మొక్కులవాడవు దేవా అనాధ రక్షక శ్రీ రమణా
అనవరతము నిను కొలిచిన వారికి భాగ్యము నీవె శుభచరణా
అప్పన్న దాసుడు నిను వేడగను చూపగ రావా నీ కరుణా  || కరుణ ||

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat