పల్లవి :
హరిహర తనయుడా అయ్యప్పా
మా పూజలందుకోవయ్యా అయ్యప్పా
గణ గణగంటల్లా అయ్యప్పా
స్వామి మమ్ము కావ కదలి రావా అయ్యప్పా || హరి ||
చరణం 1:
ఆశబరి కొండల్లో అల్లంత దూరాన
బంగారు కోవెల్లో కొలువై వున్నావయ్యా
అందాల మాస్వామి ఓదేవ మణికంఠ
చిరునవ్వు నీమోము చూపించ రావయ్యా
కోటి కోటి వందనాలు అయ్యప్పా
దేవ అందుకొనగ రావయ్యా అయ్యప్పా
అండదండా నీవేనయ్యా అయ్యప్పా
మము ఆదుకొనగ రావేమయ్యా అయ్యప్పా || హరి ||
చరణం 2:
నీ మాలను వేసినాము నీ దీక్షనె పూనినాము
నిష్టతోడను స్వామి ఇరుముడులు కట్టినాము
కాలినడకను స్వామి నీ కొండ చేరినాము
భక్తి తోడను స్వామి సేవింప వచ్చినాము
మెట్టు మెట్టు ఎక్కుకుంటూ అయ్యప్పా
నీ పాటలెన్నో పాడుకుంటూ అయ్యప్పా
మ్రొక్కులన్ని తీర్చగాను అయ్యప్పా
నీ సన్నిధానం చేరి నాము అయ్యప్పా || హరి ||
చరణం 3:
పాలు నెయ్యిలతోనే అభిషేకమును చేసి
పడిపూజలను స్వామి ఘనముగ చేసాము
బంతి చామంతుల పూమాలలే చేసి
నీ మెడలో వేసాము నీ సేవలు చేసాము
శరణు శరణు శరణమని అయ్యప్పా
నిన్ను చేరి కోరి వేడినాము అయ్యప్పా
నీ పాటలే మధురంగా అయ్యప్పా
కన్నెస్వామి దాసుపాడినాడు అయ్యప్పా || హరి ||