సాకి
శ్రీ విఘ్నేశ్వర- విభావాస్యం.. సేవకా ఇష్టదాయకం. ఏకదంతం ఉమా పుత్రం... నమామి గూణనాయకం.. ఆ... ఆ... ఆ... ఆ...
పల్లవి
షణ్ముఖ ప్రియ సోదరా విఘ్నేశ్వరా"2"
చరణం1
సర్వ జగములకు ఆది దేవుడ నీవే
వేదాంత వేద్యా ఓ గౌరి తనయా
కలలో నిరంతరము నీపాద పద్మముల
నేర నెమ్మితి నా మొర వినరావా"2"
ఎలుక వాహనా....... ఏక దంతుడా......
నామొర విని నన్ను కావగ రావా
షణ్ముఖ ప్రియ సోదరా విఘ్నేశ్వర
చరణం2
బాద్ర పదంబున చవితి పూజలతోనా
బాహుదా తీరమున బావిలో వెలసిన"2"
సిద్ధి- బుద్ధి సమేతుండవై..
వరముల నొసగే ధరలంభోదర"2"
విజయము నీయరా........విష్ను వినాయకా.....
పార్వతి నందన. ప్రమద గణాధిప
షణ్ముఖ ప్రియసోదరా విఘ్నేశ్వర
చరణం 3
ఇష్టమైనది నీ కడ వదలిన
ఇష్ట కార్యములు తీర్చే గణపతి "2"
జగములనేలె శంకర తనయా
సర్వము మా కిల సిద్ధింపుమయా
నటరాజ సుతా ......నమ్మితి మయ్యా...
విఘ్నవిధాత వినుత ప్రధాత
షణ్ముఖ ప్రియ సోదరా విఘ్నేశ్వర