దీపావళి నాడు లక్ష్మీ సమేత శంఖ పూజ గురించి తెలుసా? దీనికెంత ప్రాముఖ్యత ఉందంటే..!

P Madhav Kumar


హిందూ సంప్రదాయంలో చాలా రకాల పూజలు, విధులు ఉన్నాయి.   ఇవన్నీ వివిధ దేవతలకు సంబధించి ఉంటాయి.  ప్రతి దేవతకు, దేవుడికి ప్రత్యేకంగా పూజలు, విధులను  పెద్దలు, పండితులు ఏర్పాటు చేసి ఉన్నారు.  ముఖ్యంగా లక్ష్మీదేవికి చాలా ప్రాముఖ్యత ఉంది. విష్ణుమూర్తి భార్య అయిన లక్ష్మిదేవి ఐశ్వర్యాన్ని చేకూరుస్తుంది.  విష్ణుమూర్తి చేతిలో శంఖం కూడా ఉంటుంది.  అయితే లక్ష్మిదేవిని శంఖంతో కలిపి పూజిస్తే కలిగే ఫలితాలు చాలామందికి తెలియవు.

హిందూ పంచాంగంలో వారాలు, తిథులు, నక్షత్రాలు,  ఋతువులు,  మాసాలు,  సంవత్సరాలు ఉండటం అందరికీ తెలిసిందే.. నక్షత్రాల విషయానికి వస్తే 27 నక్షత్రాలు ఉంటాయి.  వీటిలో పుష్యమి నక్షత్రం చాలా ప్రత్యేకమైనది.  నక్షత్ర రాశులకు రాజుగా పుష్యమి నక్షత్రం పరిగణించబడుతుంది.  ఈ పుష్యమి నక్షత్రానికి అధిపతిగా శనిదేవుడు ఉంటాడు.

పుష్యమి నక్షత్రం రోజు దక్షిణవర్తి శంఖాన్ని కుంకుమ, పాలతో నింపి దాన్ని విష్ణుమూర్తి, లక్ష్మీదేవికి  సమర్పించాలి. శంఖం లోనే నీరు, పంచామృత పదార్థాలు నింపి వాటిని కూడా సమర్పించాలి.  ఆ తరువాత నీటిని సమర్పించాలి.  తదనంతరం పువ్వులు, గంధం సమర్పించాలి.

పసుపు, కుంకుమ, అగరువత్తులు, ధూపం,  దీపం, నైవేద్యం సమర్పించాలి. తులసితో వీటన్నింటిని సమర్పించాలి. ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని జపించాలి.  పూజ ముగిసేటప్పుడు తెలిసి, తెలియక చేసిన తప్పులను మన్నించమని క్షమాపణ మంత్రాన్ని కూడా చెప్పుకోవాలి.

సముద్ర మథనం నుండి లక్ష్మిదేవి ఉద్భవించింది.  లక్ష్మి దేవి మాత్రమే కాకుండా శంఖం కూడా సముద్ర మథనం లోనే లభించిందని చెబుతారు.  ఈ కారణంగా శంఖాన్ని లక్ష్మిదేవి సోదరుడిగా భావిస్తారు. అందుకే దీపావళి రోజున లక్ష్మీపూజ సమయంలో పూజలో శంఖాన్ని ప్రత్యేకంగా ఉంచుతారట. పుష్యమి నక్షత్రం రోజు ఇలా చేస్తే శనిదేవుడి బాధలు తగ్గుతాయని, బాధల నుండి ఊరట లభిస్తుందని అంటారు. దీపావళి రోజున లక్ష్మీదేవికి శంఖంతో నీటిని, పంచామృత అభిషేకాన్ని చేస్తే లక్ష్మిదేవి చాలా సంతోషిస్తుంది.

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat