శివుడవే నీవనుచు సేవించనా - వేంకటేశ భజన పాటల లిరిక్స్

P Madhav Kumar

సాకి:-

భువిలోన వెలసినా మందార మాల
భక్తుల హృదయాన విరసిళ్లెను ప్రమిద లలిత వనమాల
నారాయణ శివ నారాయణ

పల్లవి:-
శివుడవే నీవనుచు సేవించనా
నారాయణుడవనుచు భావించనా 2
శివ కేశవనుడనుచు ధ్యానించనా 2
శ్రీ వెంకటేశ్వర ఏమనుచు కొలవాలి

||శివుడవే నీవనుచు||

చరణం:-1
అవధూతవో నీవు అవతార మూర్తివో
అవనిలో వెలిగేటి ఆనంద జ్యోతివో
సాయి రూపానివో సత్యదైవానివో
శ్రీ వెంకటేశ్వర ఏమనుచు కొలవాలి

||శివుడవే నీవనుచు||

చరణం:-2
ఏ పూర్వ పుణ్యమో ఈ జన్మలో మాకు 2
నీ సేవ చేయగా మనసిచ్చి నావయ్యా
నీ సేవ చేసినా భాగ్యమే భాగ్యము
శ్రీ వెంకటేశ్వర ఏమనుచు కొలవాలి

||శివుడవే నీవనుచు||


సింగర్:- పేట రామచంద్ర, తబలిస్ట్:- గుమ్మడి సూర్యనారాయణ రెడ్డి

తిరుమల తిరుపతి దేవస్థానం నందు అఖండ హరినామ సంకీర్తన కార్యక్రమంలో పాల్గొన్న శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి భజన బృందం ఆలమూరు, అనంతపురం జిల్లా

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat