శివుని మెడలో నాగరాజా చిన్ని పార్వతి పిలచెను - శివ భజన పాటల లిరిక్స్

P Madhav Kumar


శివుని మెడలో నాగరాజా చిన్ని పార్వతి పిలచెను దేవా
దేవి పలుకు లాలకించవా శివనాగరాజా
తల్లి పలుకు లిన్నవించావా
శివా నాగరాజా తల్లి పలుకు లిన్నవించావా

మల్లెపూల మాలుగట్టి బంతిపూలు మెడలో వేసి
పొన్న పూలతొ నిన్నే కొలచితిరా
శివనాగరాజా పొన్నపూలతో నిన్ను కొలచితిరా
శివా నాగరాజా పొన్నపూలతో నిన్ను కొలచితిరా

అన్నపూర్ణ హైమావతీ పంకజాక్షి పద్మావతీ
కనక దుర్గా నిన్నే పిలచిందా శివనాగరాజా
కనక దుర్గా నిను పిలచిందా
శివా నాగరాజా కనక దుర్గా నిను పిలచిందా

వెండి గిన్నెలో వెన్నా బెట్టి పసిడి గిన్నెలో పాలు బోసే
పాలు ఆరగించ రావయ్య శివనాగరాజా
వెన్న ఆరగించ రావయ్యా
శివా నాగరాజా  వెన్న ఆరగించ రావయ్యా

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat