Read in: తెలుగు | ಕನ್ನಡ | தமிழ் | देवनागरी | English | മലയാളം | ગુજરાતી | मराठी |

హరహర శంకరా భోళా శంకరా - శివ భజన పాటల లిరిక్స్


హరహర శంకరా భోళా శంకరా
శివ శివ శంకరా నీల కంఠుడా
పరమేశ్వరా జగదీశ్వరా
జంగమ దేవర జగతికే నీవయ్యా


తలపైన గంగమ్మ మెడలోన నాగన్న
జడపైన చంద్రన్న తోడుగ నీపార్వతమ్మ
పులిచర్మాంబరమే ధరియించినవాడా
పశుపతినాథ మము పాలింపవ -2

|| హర ||


తల్లి తండ్రి లేరంట జననమేమొ తెలియదంట
ఒళ్ళంతా బూడిదంట స్మశానమే వాసమంట
ముక్కంటి ఈశ్వరుడా ముక్తిని నొసగుమురా
మహాదేవా నిన్నే మరిమరి వేడితిరా.. 2
హరహర శంకరా

📢 Follow