అయ్యప్ప దీక్షలో ఆధ్యాత్మిక రహస్యాలు - పదునెట్టాంబడి

P Madhav Kumar

 


18 పరిపూర్ణతలను సాధించిన ఙ్ఞానికి సంకేతం. ఆ ఙ్ఞాన సాధనే 18 మెట్లు ఎక్కడం. 


ఈ 18 మెట్లకు చాలా ప్రాధాన్యత ఉంది. ఈ మెట్లు పంచలోహముల (బంగారు, వెండి, రాగి, ఇనుము మరియు తగరం యొక్క ఒక ప్రత్యేక మిశ్రమం) పూతతో కప్పబడి ఉంటాయి. 


41 రోజులు (మండలం) అయ్యప్ప దీక్షచేసిన వారు మాత్రమే పదునెట్టాంబడి ఎక్కుటకు అర్హులు. ఇది శబరిగిరీశుడు అయ్యప్ప నడిచిన దారి. అందుకే అత్యంత పవిత్రమైనది. ఎవరైతే పదునెట్టాంబడిని 18 సార్లు ఎక్కుతారో వాళ్ళు శబరిమలలో ఒక కొబ్బరి మొక్కని నాటుతారు.


మొదటి 8 మెట్లు - అరిషడ్వర్గములను(6) మరియు రాగములను (2) సూచిస్తాయి - కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మాత్సర్యం, దంబం, అహంకారం. 


తదుపరి 5 మెట్లు పంచేంద్రియములను సూచిస్తాయి  - నేత్రములు, చెవులు, నాసిక, జిహ్వ, స్పర్శ.


తదుపరి 3 మెట్లు మూడు గుణములను సూచిస్తాయి  - సత్వం, తామసం, రాజసం.


చివరి 2 మెట్లు  - విద్య, అవిద్యలను సూచిస్తాయి.


- హిందూ వేదాంతం ప్రకారము '18' వ అంకెకు గొప్ప గుర్తింపు ఉంది. అయ్యప్ప 18 ఆయుధాలతో చెడును నిర్మూలిస్తాడు. ఆ 18 మెట్లు 18 ఆయుధాలను సూచిస్తాయని చెబుతారు.


- భగవద్గీతలో, మహాభారతంలో, చతుర్వేదాలలో (ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అధర్వణవేదము) 18 అధ్యాయాలు ఉన్నాయి. 


- 18 పురాణాలు, ఉపపురాణాలు కలవు. మహాభారత యుధ్ధం మరియు రావణ సంహారం 18 దినములు జరిగింది. 


- కేరళలోని అయ్యప్ప సన్నిధానం 18 గొప్ప పర్వతాల మధ్యన ఉంటుంది. ఆ 18 పర్వతాలు - పొన్నంబలమేడు, గౌడెన్మల, నాగమల, సుందరమల, చిట్టంబలమల, ఖల్గిమల, మతంగమల, మ్య్లదుంమల, శ్రీపాదమల, దేవర్మల, నిలక్కలమల, తలప్పరమల, నీలమల, కరిమల, పుదుసేర్య్మల, కలకెట్టిమల, ఇంచిప్పరమల & శబరిమల).


లోకరక్షకనే శరణమయ్యప్ప ! 


సద్గుణ మూర్తియే శరణమయ్యప్ప !! 


పదునెట్టాంబడి అధిపతియే శరణమయ్యప్ప !!!

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat