Read in: తెలుగు | ಕನ್ನಡ | தமிழ் | देवनागरी | English | മലയാളം | ગુજરાતી | मराठी |

కార్తీక మాసాన కలిమాయలు బాప - అయ్యప్ప భజన పాటల లిరిక్స్


సాకి...
వచ్చింది వచ్చింది కార్తీక మాసం
అది మాకు తెచ్చింది అయ్యప్ప దీక్ష అయ్యప్ప దీక్ష

పల్లవి...
కార్తీక మాసాన కలిమాయలు బాప
శబరి కొండపై వెలసిన అయ్యప్ప నిన్నే శరణంటిరా
అయ్యప్ప శరణం స్వామి శరణం
శబరీశ శరణం మణికంఠ శరణం


పాపాలు శాపాలు బాపేటి దేవుడా
నిత్యమోహనుడా హరిహర సుపుత్రా
పంపా విహారా పాహి పరమాత్మ
పాలింపరా ప్రభు పాండ్య వంశ తిలకా


మా ఆత్మజ్యోతి నీవనీ నమ్మితి
మా ఆత్మ యందే నిను నిలుపుకొంటి
పంచామృతాలతో అభిషేకమొనరింతు
అద్వైత మూర్తి అయ్యప్ప మముబ్రోలు

📢 Follow