సుబ్రహ్మణ్యుని, షష్ఠి దేవిని ఆరాధించండి
తారాకాసుర సంహారం కోసం శివుని తేజస్సు నుంచి జన్మించిన కుమారస్వామి.స్కంధ షష్టి రోజున శ్రీవల్లీదేవసేన సమేత సుబ్రమణ్యస్వామి కళ్యాణం.
సుబ్రమణ్య షష్టి నాడు పాలు, పంచదారతో స్వామికి కావడి సమర్పిస్తారు.తారకాసుర సంహారం కోసం దేవతల కోరిక మేరకు పరమశివుడు అంశతో మార్గశిర శుద్దషష్టి నాడు సుబ్రహ్మణ్య స్వామి జన్మించారు. ఈ షష్టినే సుబ్రహ్మణ్య షష్టి లేదా స్కంద షష్టిగా పిలుస్తారు. పూర్వం తారకాసురుడు అనే రాక్షసుడు శివుని అనుగ్రహం కోసం తీవ్రంగా తపస్సు చేసి బాలునితో తప్ప ఇతరులతో చావు లేని వరం పొందాడు. దీంతో తాను అజేయుడునని, అమరుడునని వరగర్వంతో ముల్లోకాలను గజగజలాడించగా దేవతలు విష్ణువు వద్దకు వెళ్లి మొరపెట్టుకుంటారు. వరమిచ్చిన ఆ పరమశివుని పుత్రుని వల్లే తారకాసురుని మరణం సంభవిస్తుందని శ్రీహరి తెలిపి ఆదిదేవునివద్దకు వెళ్లి సమస్యను విన్నవించుకోమని సెలవిచ్చారు. అంతట దేవతలు పరమశివుని వేడుకోవడంతో సమస్య తీవ్రతను గ్రహించి తన అంశతో సుబ్రహ్మణ్య స్వామి జన్మకు కారకులయ్యారు.
పురాణగాథల ప్రకారం.. పరమశివుని దివ్యతేజస్సు వాయుదేవునిలో ప్రవేశింపబడి తిరిగి వాయుదేవుడు అగ్నిలో ప్రవేశింపజేశాడు. అగ్ని కూడా శివతేజస్సును తాళలేక గంగానదిలో విడిచిపెట్టగా రుద్రతేజం ప్రవాహంలో రెళ్లి వనంలో (శరవనం ) చిక్కుకొని ఆరు ముఖాలు (షణ్ముఖాలు) పన్నెండు చేతులతో ఓ బాలుడు జన్మించాడు. అతడే సుబ్రహ్మణ్యస్వామి లేదా కుమార స్వామి. కుమారస్వామిని దేవతలు తమ సేనాధిపతిని చేశారు. కుమారస్వామి తారకాసురుడితో ఆరు రోజుల పాటు భీకర యుద్ధం చేసి వధించాడు. లోకాన్ని, దేవతలను కాపాడి అందరి మన్ననలు పొందిన సుబ్రహ్మణ్యస్వామి దేవసేనాపతిగా కీర్తింపబడ్డారు.
సుబ్రహ్మణ్య షష్ఠి రోజున భక్తులు తెల్లవారే లేచి తలంటు స్నానమాచరించి పాలు, పంచాదారలతో నిండిన కావిడలను ధరించి సుబ్రహ్మణ్య స్వామికి సమర్పిస్తారు. దేవాలయాలను దర్శించి భక్తిశ్రద్ధలతో అష్టోత్తర శతనామాల పూజలు చేస్తారు. భక్తులు కావడిలతో తెచ్చిన పంచదార, పాలను స్వామికి సమర్పించుకుంటారు. అయితే ఈ కావడిలోని వస్తువులు భక్తుల మొక్కుల బట్టి ఉంటాయి. ముఖ్యంగా ఈ ఆచారం తమిళనాడులో విశేషంగా ఆచరణలో ఉన్నది.
స్కంద షష్టి నాడు శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యస్వామి కళ్యాణం నిర్వహిస్తారు. అవివాహితులు ఈ కళ్యాణం వీక్షిస్తే ఆటంకాలు తొలగి వివాహాలు జరుగుతాయి.. అంతేకాదు సత్సంతానం కలుగుతుందని పెద్దలు చెబుతున్నారు. విశిష్టమైన ఈ రోజు సుబ్రహ్మణ్య స్వామి పూజ చేసినా, కావడి సమర్ఫించినా సత్సంతాన ప్రాప్తి. రాబోయే తరాలవారికి కూడా సంతాన లేమి లేకుండా వంశాభివృద్ధి జరుగుతుందని నమ్మకం. అందుకే సుబ్రహ్మణ్యస్వామి ఆలయాలు ఎక్కువగా మహిళలు సందర్శిస్తుంటారు. ఈ రోజు పుట్టలో పాలు పోస్తే సర్పదోషాలు తొలగిపోతాయని నమ్మకం. స్కంద షష్ఠి నాడు సుబ్రహ్మణ్యస్వామి కళ్యాణం జరిపించే భక్తులకు సకలశుభాలు కలుగుతాయని ప్రతీతి.
ఓం శ్రీ షష్ఠి దేవిని ఆరాధించండి
ఓం శం శరవణభవ🌹🙏🏻🌹
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
*పరమ పవిత్రమైన*
*స్కంద షష్ఠి*
➖➖➖✍️
స్కంద షష్టి కార్తీక మాస శుక్ల షష్ఠి రోజున తమిళనాడులో జరుపుతారు.
*మన తెలుగు రాష్ట్రాల్లో మార్గశిర మాసంలో సుబ్రహ్మణ్య షష్ఠి జరుపుకుంటాము*
కానీ
*ఈ స్కంద షష్ఠి వేరు ..*
*సుబ్రహ్మణ్య షష్ఠి వేరు ..*
అని గమనించాలి.
ఆదిదంపతులైన ఆ శివపార్వతుల కుమారుడైన సుబ్రహ్మణ్యుని ఆరాధించే అతి పవిత్రమైన రోజు ఈ స్కంద షష్టి. అయితే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన ఒక ముఖ్య విషయం ఏమిటంటే మనం జరుపుకునే సుబ్రహ్మణ్య షష్ఠి అయినా, తమిళనాడులో జరిపే స్కంద షష్ఠి అయినా రెండిటిలోనూ సుబ్రహ్మణ్యుని ఆరాధన ఒకే విధంగా ఉంటుంది.
అంతే కాదు, ఏ మాసంలో అయినా షష్ఠి తిథి రోజున ఇలా ఆరాధించడం అత్యంత ఫలప్రదం.
*శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి జన్మ వృత్తాంతాన్ని క్లుప్తంగా తెలుసుకుందాము.*
తారకాసురుడు అనే రాక్షసుడు ముల్లోకాలనూ భయభ్రాంతులకు గురిచేస్తూ లోకకంటకుడుగా ఉన్నాడని దేవతలు అందరూ బ్రహ్మదేవునికి మొరపెట్టుకున్నారు.
ఈ తారకాసురుడు అమిత బలశాలి , తపోబల సంపన్నుడు. ఈశ్వర తేజాంశ వలన సంభవించిన వాని వల్ల మాత్రమే మరణము పొందగలడు అని వరము కలిగి ఉన్నాడు. అందుచేత , మీరందరూ ఆ మహాశివుని శరణు వేడి , ఆయనకు మరియు హిమవంతునకు పార్వతీ దేవి రూపమున జన్మించిన సతీదేవికీ , వివాహం జరిపించిన , వారికి కలిగే సంతానము ఈ లోకకంటకుని సంహరించగలడు అని సెలవిచ్చాడు. అప్పటికే తపోనిష్ఠలో ఉన్న పరమశివునికి , వారిని సేవిస్తూ సర్వోప చారములూ చేస్తున్న పార్వతీ దేవికీ మధ్య ప్రణయ బంధాన్ని పెంపొందించే విధంగా మన్మధుడు తన ప్రాణాలను పణంగా పెట్టి ప్రయత్నించాడు.
ఈ ప్రయత్నంలో మన్మధుడు తన ప్రాణాలను పోగొట్టుకున్నప్పటికీ , పార్వతీ పరమేశ్వర వివాహం సుసంపన్నమయింది. వారి వివాహానంతరమూ దేవతల విన్నపము మేరకు మన్మధుని పునర్జీవింపజేస్తాడు మహాశివుడు.
అటు పిమ్మట పార్వతీ పరమేశ్వరుల ఏకాంత సమయాన అగ్నిదేవుడు ఒక పావురము రూపమున ఆ ప్రణయ మందిరమందు ప్రవేశిస్తాడు. అది గ్రహించిన మహాశివుడు తన దివ్య తేజస్సును అగ్నియందు ప్రవేశపెడతాడు. ఆ శక్తిని భరించలేక అగ్నిహోత్రుడు ఆ తేజమును గంగానదిలో విడిచిపెడతాడు. గంగానది తనలోకి చేరిన ఆ తేజమును ఆ సమయంలో నదీస్నానం ఆచరిస్తున్న షట్ కృత్తికలనబడే దేవతల గర్భాన ప్రవేశపెడుతుంది. ఆ రుద్ర తేజమును తాళలేక ఆ దేవతా స్త్రీలు రెల్లు పొదలయందు విడిచిపెడతారు. ఈ ఆరు తేజస్సులు కలిసి ఆరు ముఖాలు కలిగిన దివ్య బాలునిగా ఉద్భవిస్తాడు. ఆరు ముఖములు కలిగిన వాడు కావున షణ్ముఖుడు అని పిలువబడతాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న పార్వతీపరమేశ్వరులు ఆ బాలుని కైలాసానికి తీసుకునివెళ్లి పెంచుకుంటారు.
ఈ బాలుడు గంగా గర్భంలో తేజోరూపంలో ఉన్నందున గాంగేయుడు అని , షట్ కృత్తికలు పెద్ద చేసిన కారణాన కార్తికేయుడు అని , ఆరు ముఖాలు కలిగి ఉండటం వలన షణ్ముఖుడు అని , గౌరీశంకరుల పుత్రుడు అయిన కారణాన కుమార స్వామి యని పిలువబడతాడు.
ఈతడిని దేవతల కోరిక మేరకు పరమేశ్వరుడు శూలం , పార్వతీ దేవి శక్తి , మరియు ఇతర ఆయుధాలను అందించి సర్వశక్తి సంపన్నుడిని చేసి దేవతలకు సర్వ సైన్యాధ్యక్షునిగా చేస్తారు. దేవసైన్యానికి సైన్యాధ్యక్షుడైన ఈ సుబ్రహ్మణ్యుడు తారకాసురుడనే అసురుడితో రకరకాలైన శక్తులతో మరియు రూపాలతో పోరాడి సంహరించాడు. యుద్ధ మధ్యలో సర్ప రూపం దాల్చి రాక్షస సేనను చుట్టుముట్టి వారిని సంహరించాడు.
ఆయన రెల్లుపొదలలో జన్మించడం చేత ఆయనను శరవణభవుడు అనే పేరుతో కూడా పిలుస్తారు. ఈ సుబ్రహ్మణ్యేశ్వరుడు తారకాసుర సంహారం అనంతరం బ్రహ్మ పట్ల తన అహంభావాన్ని ప్రదర్శించడంతో ఆతని తండ్రి అయిన ఆ మహాశివుడు హెచ్చరించాడు. ఆ తరువాత తన తప్పు తెలుసుకుని కఠోరమైన తపస్సును చేస్తాడు. శరీరంలో కొలువై నిద్రాణమై ఉన్న కుండలినీ శక్తిని మేల్కొలిపి సమస్త దుర్గుణాలను జయించాడు. ఆయన మహాకఠోర తపస్సాధన వలన సహస్రాకారం చేరుకొని బుద్ధిని వికసింపజేసుకున్నాడు. స్వచ్ఛమైన మనసు మరియు వికసించిన బుద్ధి కలవాడిగా మారిన కారణంగా ఆయనను సుబ్రహ్మణ్యుడు అని పిలుస్తారు.
తారకాసుర సంహారసమయానికి ఆయన బ్రహ్మచారి. అటు తర్వాత శ్రీ మహావిష్ణువు కోరిన కారణంగా ఆయన వల్లీ మరియు దేవసేనలను వివాహమాడెను. ఈ స్కంద షష్టి నాడు నాగ ప్రతిమలను మరియు సుబ్రహ్మణ్య స్వామి ఆలయం దర్శించుకుని ఆయన ఆరాధన చేయడం మనం చూస్తూ ఉంటాము.
*స్కంద షష్ఠి పూజా విధానం :*
స్కంద షష్టి నాటి ఉదయాన్నే శుచిగా స్నానమాచరించి ఎటువంటి ఆహారమూ తీసుకోకుండా తడి బట్టలతో సుబ్రహ్మణ్య ఆలయ దర్శనం చేసుకుని పువ్వులు , పళ్ళు మరియు పడగల రూపాలను స్వామికి సమర్పించవచ్చు.
పిండి దీపం అంటే వరి పిండి , బెల్లము కలిపి చేసిన మిశ్రమంతో ప్రమిదలు చేసి , నెయ్యితో దీపాలు వెలిగించాలి. ఇవి ఉదయం మరియూ సాయంత్రం వేళల్లో వెలిగించవచ్చు. రోజంతా ఉపవాసం ఉండి , సుబ్రహ్మణ్యుని చరిత్ర , స్తోత్రాలు పఠించాలి. వీలైతే సుబ్రహ్మణ్యుని ఆలయానికి వెళ్లి దర్శించుకోవాలి. చలిమిడి , చిమ్మిలి , వడపప్పు నైవేద్యంగా సమర్పించాలి. ఈనాడు వల్లీ మరియు దేవసేనా దేవిలతో సుబ్రహ్మణ్య కళ్యాణం కూడా జరిపించడం చూస్తాము.
బ్రహ్మచారిగా ఉన్న సుబ్రహ్మణ్యుని ఆరాధన చేసేవారు ఈనాడు బ్రహ్మచారి పూజ చేసి ముగ్గురు లేదా ఐదుగురు బ్రహ్మచారులకు పూజాదికాలు అర్పించి బట్టలు పెట్టి భోజనాలు పెట్టడం ఒక ఆచారం. కొన్ని ప్రాంతాలలో షష్టినాటి రోజంతా ఉపవాస దీక్షలో ఉండి మరుసటి రోజు అనగా సప్తమి నాడు బ్రహ్మచారి పూజ చేసుకోవడం కూడా చూస్తాము.
ఎంతో ప్రసిద్ధి కాంచిన కావడి మొక్కు తీర్చుకునే రోజు తమిళనాట ఎన్నో ప్రాంతాలలో ఈరోజే చూస్తాము. ఈ కావడి కుండలను పంచదార , పాలు , పెరుగు , పూలు , వెన్న , నెయ్యి , తేనె ఇలా వివిధ ద్రవ్యాలతో నింపుతారు. ఈనాటి రోజున సుబ్రహ్మణ్య విగ్రహ ప్రతిష్ట చేసినవారికి సంతాన ప్రాప్తి కలుగుతుందనే నమ్మకం చాల ప్రాంతాలలో ఉంది.
ఈ వ్రతం సందర్భంగా ఎంతోమంది కంబళ్ళు , దుప్పట్లు లాంటివి దానంగా పంచిపెట్టడం చూస్తాము. ఇది ఒకరకం గా సమాజ శ్రేయస్సు గా కూడా చెప్పుకోవచ్చు. చలి మొదలై బీదలు సరైన నీడ లేక ఇబ్బంది పడే ఈ సమయం లో ఇటువంటి దానాలు భక్తులకున్న భక్తిని మరియు సమాజ శ్రేయోదృక్పదాన్ని కూడా చాటి చెప్పుతాయి.
ఇంతటి పవిత్రమైన రోజున సుబ్రహ్మణ్య స్తోత్రాలు మరియు సంతాన సాఫల్యం కలగజేసే షష్టి దేవి స్తోత్రం పఠించడం అత్యంత ఫలప్రదం !✍️
🙏 *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
🙏 *లోకా సమస్తా సుఖినోభవన్తు!*
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
🙏🙏🙏🌼🌼🌼🌼🙏🙏🙏
*🌼మహా షష్ఠి సుబ్రహ్మణ్యారాధన🌼*
🌼🌿🌼🌿🌼🌿🌼🌿
*🌼శ్రీ సుబ్రహ్మణ్యం శరణం ప్రపద్యే🌼*
ఆరు ముఖములను, పన్నెండు చేతులను కలిగి నెమలి వాహనారూఢుడై దివ్య తేజస్సుతో వెలుగొందుతూ ఉన్న శివపార్వతుల గారాల బిడ్డ దేవ సేనల ప్రభువు కేవలం కావడి మొక్కులను సమర్పించినంతనే భక్తులకు వంశాభివృద్ధిని, బుద్ధి సమృద్ధిని ప్రసాదించే భక్తసులభుడైన శ్రీ సుబ్రహ్మణ్యస్వామి వారు జన్మించిన పవిత్ర పర్వదినం 'శ్రీ సుబ్రహ్మణ్య షష్టి'. ప్రతి సంవత్సరం శుక్లపక్ష షష్టినాడు శ్రీ సుబ్రహ్మణ్య షష్టి పర్వదినాన్ని జరుపుకోవడం ఆచారం. ఈ పర్వదినానికి సుబ్బరాయషష్టి, కుమారషష్టి, స్కందషష్టి, కార్తికేయషష్టి, గుహప్రియా వ్రతం వంటి పేర్లున్నాయి.
*🌼శ్రీ సుబ్రహ్మణ్యస్వామి పుట్టుక...🌼*
శ్రీ సుబ్రహ్మణ్యస్వామి పుట్టుకకు సంబంధించిన ఆసక్తికరమైన గాథలు పురాణాల్లో కనిపిస్తాయి. పూర్వం తారకాసురుడు అనే రాక్షసుడు బలగర్వితుడై సకల లోకవాసులను హింసిస్తూ ఉండడంతో దేవతలందరూ కలిసి బ్రహ్మదేవుడి వద్దకు వెళ్ళి మొరపెట్టుకున్నారు అందుకు ''శివుడు తపస్సు చేస్తూ ఉన్నాడు. శివుడు తపస్సు మానేసి పార్వతీదేవిని పరిణయమాడునట్టు చేస్తే వారికి జన్మించే కుమారుడు తారకాసురుడిని అంతమొందిస్తాడు'' అని ఉపాయం చెప్పాడు. ఈ మాటలను విన్న దేవతలు, శివుడు తపస్సు మాని పార్వతీదేవిని వివాహం చేసుకునేలాగా చేసేందుకు మన్మథుడిని పంపగా శివుడు తన మూడవ నేత్రం తెరిచి మన్మథుడిని దహించి వేశాడు. అయితే తారకాసురుడిని అంత మొందించవలసిన అవసరాన్ని గుర్తించిన శివుడు తనకు పరిచర్యలు చేస్తూ ఉన్న పార్వతీదేవిని వివాహం చేసుకున్నాడు. వారిద్దరూ శృంగారంలో తేలియాడుతూ ఉన్న సమయంలో శివుడి రేతస్సు పతనమై భూమిపై పడింది. దానిని భూమి భరించలేక అగ్నిలో పడవేసింది.
అగ్నిదానిని భరించలేక గంగలో వదలగా దానిని గంగ తన తీరంలోని శరవణమునకు తోసివేసింది. అక్కడే శ్రీకుమారస్వామి జన్మించాడు. శరవణమున జన్మించిన వాడు కనుక స్వామికి 'శరవనబహ్వుడు' అనే పేరు ఏర్పడింది. అంతేకాకుండా గంగానదిలో పడిన రేతస్సు ఆరు భాగాలుగా ఏర్పడింది. ఆ ఆరు భాగాలు అలల తాకిడికి ఏకమై ఆరు ముఖములు, పన్నెండు చేతులు, రెండు కాళ్ళతో శ్రీ సుబ్రహ్మణ్య స్వామి జన్మించాడు. అందువల్ల ఆయనకు 'షణ్ముఖుడు' అనే పేరు ఏర్పడింది. ఈ విధంగా ఆవిర్భవించిన శ్రీ సుబ్రహ్మణ్యస్వామిని పెంచేందుకు శ్రీమహావిష్ణువు ఆరు కృత్తికలను నియమించారు. వారు పెంచి పెద్ద చేశారు. ఆరు కృత్తికల చేత పెంచబడడం వల్ల స్వామికి 'కార్తికేయుడు' అనే పేరు ఏర్పడింది. ఈ విధంగా కృత్తికల చేత పెంచబడిన శ్రీ సుబ్రహ్మణ్యస్వామి తారకాసురుడిపై దండెత్తి తారకాసురుడిని అంతమొందించి దేవతలను ప్రజలను రక్షించినట్లు కథనం.
*🌼బ్రహ్మనే బంధించిన శ్రీ సుబ్రహ్మణ్యస్వామి !🌼*
త్రిమూర్తులలో లయకారుడైన శివుడికి కుమారుడిగా జన్మించి స్థితికారుడైన శ్రీ మహావిష్ణువు నియమించిన కృత్తికల చేత పెంచబడిన శ్రీ సుబ్రహ్మణ్యస్వామి సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడిని బాల్యంలోని బందించినట్లు పురాణాలు చెప్తున్నాయి. సుబ్రహ్మణ్యస్వామి పసివాడుగా తల్లి పార్వతీదేవి ఒడిలో ఉన్న సమయంలో ఒకసారి శివుడు పార్వతీదేవికి ప్రణవ మంత్రార్థాన్ని వివరించారు. బాలుడుగా ఉన్న సుబ్రహ్మణ్యస్వామి దానిని విన ఆకళింపు చేసుకున్నాడు. ఒకసారి బ్రహ్మదేవుడు కైలాసానికి రాగా బాలుడుగా ఉన్న సుబ్రహ్మణ్య స్వామి ప్రణవమంత్రార్థాన్ని చెప్పాల్సిందిగా అడిగాడు. బ్రహ్మ సరిగ్గా చెప్పకపోవడంతో సుబ్రహ్మణ్యస్వామి బ్రహ్మదేవుడుని బంధించాడు. శివుడు జోక్యం చేసుకుని విడిపించాడు.
*🌼నెమలి వాహనం,కోడి ధ్వజం...🌼*
తారకాసురుడి సోదరుడైన శూరపద్ముడు దేవతలను ఇబ్బందిపాలు చేస్తూ ఉండడంతో సుబ్రహ్మణ్యస్వామి శూరపద్ముడుపై దండెత్తి యుద్ధం చేశాడు. యుద్ధంలో ఆరవరోజు శూరపద్ముడు పక్షి రూపాన్ని ధరించి తలపడ్డాడు. సుబ్రహ్మణ్యస్వామి శూలాయుధం ప్రయోగించడంతో పక్షి రెండుగా ఖండింపబడింది. ఆ రెండిటిలో ఒకటి నెమలిగా, మరొకటి కోడిపుంజుగా మారి శ్రీ సుబ్రహ్మణ్యస్వామి వారిని శరణు వేడుకోవడంతో....నెమలిని వాహనంగా, కోడిని ధ్వజంగా చేసుకుంటున్నట్లు పురాణ కథనం.
*🌼వల్లీ...దేవసేనలు...🌼*
శ్రీ సుబ్రహ్మణ్యస్వామికి ఇద్దరు దేవేరులున్నారు. శ్రీవల్లీదేవి, శ్రీదేవ సేనలు. వారు తారకాసురుడిని అంతమొందించిన తర్వాత దేవేంద్రుడు తన కుమార్తె దేవసేనను సుబ్రహ్మణ్యస్వామికిచ్చి వివాహం చేయగా, తిరుత్తణి ప్రాంత పాలకుడైన నందిరాజు కుమార్తె వల్లీదేవిని వేటగాడి రూపంలో వెళ్ళి వివాహం చేసుకున్నట్లు పురాణ కథనం.
*🌼కావడి మొక్కులంటే ఇష్టం..🌼.*
పూర్వం అగస్త్య మహర్షి కైలాసానికి వెళ్ళి శివుడిని దర్శించి తిరిగి వెళ్ళే సమయంలో శివుడు రెండు కొండలను బహుకరించి శివశక్తి రూపంగా దక్షిణాదికి తీసుకు వెళ్ళి కొలవవలసిందిగా తెలిపారు. వాటిని స్వీకరించిన అగస్త్యుడు వాటిని ఇదంబుడు అనే శిష్యుడికిచ్చి తన వెంట వాటిని తీసుకుని రావలసిందిగా తెలిపాడు. ఇదంబుడు కావడిని కట్టుకుని రెండు పర్వతాలను అందులో ఉంచుకుని అగస్త్యుడి వెంట నడవసాగాడు. కొంత దూరం అంటే పళని వచ్చేసరికి ఆయాసం అధికమై కొంత సేపు విశ్రాంతికి ఆగాడు. కొంతసేపు విశ్రాంతి తీసుకుని మళ్ళీ కావడిని ఎత్తగా ఒకవైపు పైకి లేచింది. మరోవైపు లేకపోవడంతో వెనుతిరిగి చూడగా దానిపై సుబ్రహ్మణ్యస్వామి నిలబడి ఉన్నాడు. కొండ దిగి వెళ్ళిపోమన్నాడు. పోకపోవడంలో వారిద్దరి మధ్యా యుద్ధం జరిగి చివరకు ఇదంబుడు చనిపోయాడు. ఈ విషయం తెలుసుకుని అగస్త్యుడు ప్రార్థించడంతో స్వామి తిరిగి బతికించారు. ఈ విషయం ఇదంబుడి భార్యకు తెలిసి కావడిలో పాలను తీసుకువెళ్ళి కృతజ్ఞతగా స్వామివారికి సమర్పించింది. అప్పటి నుంచి కావడి మొక్కులను సమర్పించడం ఆచారమైంది. కాగా, కావడిని ఉపయోగించే బద్ద 'బ్రహ్మదండం' అనీ కర్కోటక అనే అష్టనాగులకు ప్రతీకలని చెప్పబడుతూ ఉంది.
సుబ్రహ్మణ్య షష్టి నాడు శ్రీ సుబ్రహ్మణ్యస్వామి వారిని షోడశోపచారాలు అష్టోత్తరాలతో పూజించి నైవేద్యం సమర్పించాలి. ఈ దినమంతా ఉపవాస వ్రతం పాటించి మరుసటిరోజు తిరిగి పూజ చేసి భోజనం చేసి ఉపవాసంను విరమించాలి. అంతేకాకుండా శ్రీ సుబ్రహ్మణ్యస్వామివారిని సర్పంగా కూడా ఆరాధిస్తూ ఉండడం ఆచారం. కనుక పుట్ట వద్దకు వెళ్ళి పూజ చేసి పుట్టలో పాలుపోయడం కూడా సత్ఫలితాలను ఇస్తుంది. దీనికి తోడు గ్రహదోషాలతో బాధపడేవారు ముఖ్యంగా రాహు, కేతు, సర్ప, కుజదోషములున్న వారు కఠినమైన ఉపవాసం ఉండి శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారిని పూజించడం వల్ల ఫలితాలుంటాయని చెప్పబడుతూ ఉంది.
*బ్రహ్మచారికి పూజ*
సుబ్రహ్మణ్యషష్టినాడు బ్రాహ్మణ బ్రహ్మచారిని ఇంటికి పిలిచి సుబ్రహ్మణ్యస్వామి రూపంగా భావించి పూజించి పులగం, క్షీరాన్నం వంటి వంటలను చేసి భోజనం పెట్టి, పంచలసాపు,దక్షిణలను తాంబూలమందు ఉంచి ఇచ్చి నమస్కరించాలి. ఈ విధంగా చేయడం వల్ల అనంతమైన పుణ్య ఫలాలు కలుగుతాయి.
వీటికి తోడు ఈరోజు "శరవణభవ" అనే ఆరు అక్షరాల నామమంత్రాన్ని పఠించడం, జపించడం కూడా మంచి ఫలితాలను ప్రసాదిస్తుంది. ఈ విధంగా సుబ్రహ్మణ్యషష్టి జరుపుకోవడం వల్ల వంశాభివృద్ధి, విజ్ఞానాభివృద్ధి, బుద్ధి సమృద్ధి కలుగుతాయి.
*షదాననం చందన లేపితాంగం*
*మహారసం దివ్య మయూర వాహనం*
*రుదస్య నూనుం సురలోకనాథం*
*శ్రీ సుబ్రహ్మణ్యం శరణం ప్రపథ్యే.*
🙏🙏🙏🌼🌼🌼🌼🙏🙏🙏🙏