నవరాత్రులు: శరన్నవరాత్రులు - శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవి Sri Bala Tripura Sundari Devi

P Madhav Kumar

 


శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవి

హ్రీంకారాసన గర్భితానల శిఖాం సౌఃక్లీం కళాంబిభ్రతీం
సౌవర్ణాంబర ధారిణీం వరసుధాదౌతాం త్రినేత్రోజ్జ్వలాం
వందే పుస్తక పాశమంకుశధరాం స్రగ్భూషితాముజ్జ్వలాం
తాంగౌరీం త్రిపురాం పరాత్పర కళాంశ్రీచక్ర సంచారిణీమ్

శ్రీ బాలా త్రిపుర సుందరీ

రంగు:  లేత గులాబి
పుష్పం:  తుమ్మి
ప్రసాదం:  బెల్లపు పరమాన్నం

 త్రిపురిని భార్య త్రిపుర సుందరీ దేవి, అంటే ఈశ్వరుడి భార్య అయిన గౌరీదేవి అని అర్థము. మనస్సు, బుధ్ధి, చిత్తము, అహంకారము త్రిపుర సుందరీదేవి అధీనములో ఉంటాయి. అభయహస్త ముద్రతో, అక్షమాల ధరించిన అమ్మను ఆరాధిస్తే మనో వికారాలు తొలగిపోతాయి. నిత్య సంతోషము కలుగుతుంది. త్రిపుర సుందరీదేవి శ్రీ చక్రములోని త్రిపురాత్రయములో మోదటి దేవత. కనుక ఉపాసకులు త్రిపుర సుందరీదేవి అనుగ్రహము కోసము బాలార్చన చేస్తారు. సత్సంతానాన్ని అనుగ్రహించే దేవతగా త్రిపురసుందరీదేవి భక్తుల పూజలందుకుంటోంది. ఈ రోజు రెండు నుంచి పదేళ్ళలోపు బాలికలను అమ్మవారి స్వరూపముగా భావించి పూజ చేసి క్రొత్త బట్టలు పెట్టాలి.

ఓం ఐం హ్రీం శ్రీం బాలా త్రిపుర సుందర్యైనమోనమః  అనే మంత్రాన్ని 108 మార్లు జపించాలి.

త్రిశతీ పారాయణ చేసి అమ్మవారికి పాయసము నివేదన చెయ్యలి.

బాలా స్తుతి

ఆయీ ఆనన్దవల్లీ అమృతకర తల్లీ ఆదిశక్తీ పరాయీ
మాయా మాయా స్వరూపీ స్ఫటికమణిమయీ మాతంగీ షడంగీ
ఙ్ఞానీ ఙ్ఞానస్వరూపీ నళిన పరిమళీ నాద ఓంకార యోగీ
యోగీ యోగాసనస్థా భువనవశకరీ సౌన్దరీ ఐం నమస్తే

బాలా మన్త్రే  కటాక్షీ మమహృదయసఖీ ముక్తభావ ప్రచండీ
వ్యాళీ యఙ్ఞోపవీతే వికట కటి తటీ వీరశక్తీ ప్రసాదీ
బాలే బాలేన్దుమౌళే మదగజభుజహస్తాభిషేక్త్రీ స్వతన్త్రీ
కాళీ త్వాం కాలరూపీ ఖగ గలన హృదీ, కారణీ క్లీం నమస్తే  

మూలాధారే మహిమ్నీ హుతవహనయనీ మూలమన్త్రీ త్రినేత్రీ
హరాః కేయూరవల్లీ అఖిలసుఖకరీ అంబికాయాః శివాయా
వేదే వేదాన్తరూపీ వితత ఘనతటీ వీరతన్త్రీ భవానీ
శౌరీ సంసార యోనీ సకల గుణమయీ తేద్య శ్రీం సౌః నమస్తే

ఐం క్లీం సౌః సర్వమన్త్రే మమ వరశుభకరీ అంగనా చేష్టితాయా
శ్రీం హ్రీం క్లీం బీజముఖ్యైః దినకర కిరణైః జ్యోతిరూపే శివాఖ్యే
హ్రీం మ్రీం హ్రూం హేమవర్ణే హిమకరకిరణా భాసమానేన్దుచూడే
క్షాం క్షీం క్షూం క్షౌమవాసే సకల జయకరీ శక్తి బాలే నమస్తే  

శ్రీ త్రిపురసుందరీ స్తోత్రం

కదంబవన చారిణీం మునికదంబకాదంబినీం
నితంబజితభూధరాం సురనితంబనీసేవితాం
నవాంబురుహలోచనాం అభినంబుదశ్యామలాం
త్రిలోకచన కుటుంబినీం త్రిపురసుందరీం మాశ్రయే

కదంబవనవాసినీం కనకవల్లకీధారిణీం
మహార్హమణిహారిణిం ముఖసముల్లసద్వాసినీం
దయావిభవకారిణీం విశదలోచనీం చారిణీం
త్రిలోకచన కుటుంబినీం త్రిపురసుందరీం మాశ్రయే

కదంబవనశాలయా కుచభరోల్లసన్మాలయా
కుచోపమితశైలయా గురుకృపాలసద్వేలయా
మదారుణకపోలయా మధురగీతవాచాలయా
కయాపి ఘనలీలయా కవచితా వయం శిలయా

కదంబవనమధ్యగాం కనకమండలోపస్థితాం
షడంబురుహవాసినీం సతతసిద్ధసౌదామినీం
విడంబితజపారుచిం వికచచంద్రచూడామణిం
త్రిలోకచన కుటుంబినీం త్రిపురసుందరీం మాశ్రయే

కుచాంచితవిపంచికాం కుటిలకుంతలాలంకృతాం
కుశేశయనివాసినీం కుటిలచిత్తవిద్వేషిణీం
మదారుణవిలోచనాం మనసిజారిసమ్మోహినీం
మతంగమునికకన్యకాం మధురభాషిణీమాశ్రయే

స్మరేత్ర్పథమపుష్పిణీం రుధిరబిందునీలాంబరాం
గృహీతమధుపాత్రికాం మధువిఘూర్ణనేత్రాంచలాం
ఘన స్తనభరోన్నతాం గలితచూలికాం శ్యామలాం
త్రిలోకచన కుటుంబినీం త్రిపురసుందరీం మాశ్రయే

సకుంకుమవిలేపనా మళికచుంబికస్తూరికాం
సమందహసితేక్షేణాం శరచాప పాశాంకుశాం
ఆశేషజనమోహినీ మరుణ మాల్యభూషాంబరాం
జపాకుసుమభసురాం జపవిదౌస్మరేదంబికం

పురందరపురంధ్రికాచికురబంధ సైరంధ్రికాం
పితామహపతివ్రతాం పటుపటీర చర్చారతాం
ముకుంద రమణీమణీల సదలంక్రీయాకారిణీం
భజామి భువనాంబికాం సురవధూటికాచేటికాం

* ఇతి శ్రీ త్రిపురసుందరీ స్తోత్రం *

శ్రీ బాలాత్రిపుర సుందరీ దేవి

త్రిపురుని భార్య త్రిపుర సుందరీ దేవి! అంకే ఈశ్వరుడి భార్య అయిన గౌరి దేవి అని అర్హం. మనస్సు, బుద్ది, చిత్తం, అహంకారం బాల (తిపుర సుందరిదేవి ఆదీనంలో ఉంటాయి. 

అభయ హస్త ముదతో, అక్షరమాల ధరించిన ఈమెను ఆరాధిస్తే మనోవికారాలు తొలగిపోతాయి. నిత్యసంతోషం కలుగుతుంది. త్రిపుర సుందరిదేవి శ్రీచక్రంలోని త్రిపురాత్రయంలో మొదటి దేవత. షోడశ విద్యకు ఈమే అధిష్టాన దేవత కాబట్టి ఉపాసకులు త్రిపురసుందరి దేవి అనుగ్రహం కోసం బాలర్పన చేస్తారు. అసలు బాల త్రిపురు నామమే పరమ పవిత్రమైన నామము.

త్రిపుర సుందరి అని అమ్మని పిలవడములో ఒక రహస్యము ఉంది. అమ్మ, అయ్య వారి దాంపత్యం భలే గమ్మత్తుగా ఉంటుంది. ఇవిడేమో త్రిపుర సుందరి దేవి, అయ్య వారు ఎమో త్రిపురాంతకుడు. ఆది దంపతులు, వారి తత్వము కుడా అటువంటిది.

త్రిపుర సుందరి అంటే మనలోని మాడు అవస్తలు - జాగృత్త్‌, స్వప్న , సుషుప్తి! ఈమూడు అవస్తలు లేదా పురములకు బాల అధిమహైన దేవత! ఈ మూడు పురములను శరీరముగా చేసుకొని, ఈ జగత్తు అంతటిని అనుభవింపచేస్తు బాలగా అమ్మవారు వినొదిస్తుంది. మనము ఎన్ని జన్ములు ఎత్తిన, ఈ ముడు అవస్థలులోనే తిరుగుతు ఉంటాము. కేవలం ఉపాధులు మాత్రమే మారుతాయి.

అటువంటి తల్లి ఈ రూపములో మనలోనే ఉంది. ఆవిడ ఆత్మ స్వరూపురాలు. ఆవిడను పూజిస్తే జ్నానము కలిగి తానె శివ స్వరూపము తో చైతన్యము ప్రసాదించి, మోక్షమునకు అనగా పరబహ్మతత్వం వెపు నడిపిస్తుంది.

బాలా త్రిపురసుందరి ఆవిర్బావం (బ్రహ్మాండ పురాణం):

భండాసురుని యొక్క పుత్రులు ముప్పైమంది. వీళ్ళు అవిద్యా వృత్తులకు సంకేతం. వారు యుద్దానికి వచ్చినప్పుడు ఈ శక్తి సేనలన్నీ కూడా భయపడతాయి. ఆ సమయంలో బాలా త్రిపురసుందరి దివ్యమైన రథాన్ని ఎక్కి బయలుదేరి వచ్చింది. ఆ రథం పేరు కన్యక అనబడే రధం. పైగా హంసలు లాగుతున్నటువంటి రథం. ఆ ఒక్క తల్లి ముప్పైమంది భండాసుర పృతులనూ సంహరించింది. వాళ్ళు సామాన్యులు కారు ఇదివరకటి యుద్దాలలో ఇంద్రాదులను కూడా గడగదడలాడించినటువంటి వారు. అంత భయంకరమైన భండ పతులు. వారందరినీ ఒక్క తలై కేవలం ఒక్క అర్దచంద్ర బాణంతో సంహరించిందిట. అది ఈ తల్లి యొక్క ప్రత్యేకత.
అంటే బాలగా కనపడుతున్నా శక్తికి ఏమీ తక్కువలేదు.

బాలోపాసనలో ఉన్నటువంటి విశేషమంతా ఇతివృత్తంలోనే మనకు కనపడుతున్నది. పైగా బాల ఆరాధన ప్రాణశక్తి ఆరాధనగా చెప్పబడుతున్నది. అందుకే ఆవిడ హంసలు కూర్చిన రథంపై రావడం అంకే హంసలు అంకే శ్వాసలు అని అర్హం.

ఉచ్చ్వాసనిశ్వాసాత్మకమైన శ్వాసని, ప్రాణశక్తిని అక్కడ హంసగా ఉత్పేక్షించారు. ఆ విధంగా అమ్మవారి ఆరాధనలో ఈ [ప్రాణశక్తిని మూల పాణశక్తిని ఆరాధించడమే బాలారాధనగా చెప్పబడుతున్నది. ఈ బాలా త్రిపుర సుందరీ మంత్రము సిద్ది పొందినటువంటి వారు మాత్రమే అటు తర్వాత షోడశిని ఆరాధించడానికి అర్హులవుతారు. శ్రీవిద్యలో ఒక భాగంగా ఉన్న బాలా విద్య ఒక ప్రత్వేకవిద్యగా కూడా చాలా మంది చేత ఆరాధథింపబడుతోంది. ఈరోజు బాలా మహా త్రిపురసుందరీ రూపంగా ఈ రోజు చేసి ఇక్కడనుంచి నవరాత్రుల ఆరాధన కొనసాగిస్తున్నాం.

ఈ రోజు అమ్మవారు గులాబిరంగు చీరలో మనకు దర్శనమిస్తుంది. అమ్మవారికి ఈ రోజు నైవేద్యం కట్టె పొంగలి. ఇందులో వాడబడే పదార్దాలు నెయ్యి; పసరపప్పు, బియ్యం. అన్నం బలాన్నిస్తుంది. శరీర కాంతిని పెంపొందిస్తుంది. ఇక పెసరపప్పు త్రిదోషహారి. ఆకలిపుట్రిస్తుంది. నరాలకు బలాన్నిస్తుంది. తేలికగా జీర్ణం అవుతుంది. మిరియాలు జీలకర్ర ఆహారం తేలికగా జీర్ణం కావడానికి ఉపయోగపడతాయి.

బాలా భావనతో కుమారీ పూజ చేసినప్పుడు వాటి ఫలితాలు చెప్పారు. ఏవండీ ఒక్కరోజు ఒక్కసారి పూజచేస్తే చాలు కదా! తొమ్మిది రోజులు చేయాలా? అంటే చేయాలట. బాల పూజ తొమ్మిదిరోజులూ చేయడం వల్ల ఒక్కొక్క ఫలితం ఉన్నది.

మొదటిరోజు బాల పూజా ఫలితం :

“ శతృక్షయం ధనాయుష్యం బలవృద్ధిమ్ కరోళవై "

శతృనాశనము, ధనాన్ని, ఆయుష్తునీ, బలాన్ని వృద్ది చేయడం అనేది మొదటిరోజు చేసే కృమారీపూజయుిక్క ఫలం.

శ్రీ బాలాత్రిపురసుందరీ ధ్యాన శోకం :

అరుణకీరణ జాలైః అంచితావకాశా
విధృత జపపటీనా పుస్తకాభీతి హస్తా
ఇతర కర వరాడ్వా ఫుల్ల కల్హార సంస్థా
నివసతు హృది బాలా నిత్వ కళ్వాణ శీలా

ఎ|రని కిరణాలను వెదజల్సుతూ! జప మాల, పుస్తకము, వరద మరియు అభయ హస్తాలతో విరాజిల్లుతూ, విచ్చుకున్న తెల్లని పద్మం పువ్వులో ఆసీనురాలై ఉన్న నీ బాలా త్రిపురసుందరీ దేవి
నిత్యమూ నా హృదయమునందు ఉండుగాక అని ఈ శోకం యొక్క అర్తం.

బాలా త్రిపురసముందరి త్రిపురేశైయ్య విద్యహే
కామేశ్వర్యాయ్ చ ధీమహీ
తన్నో బాలా ప్రచోదయాత్‌!







#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat